Sleep From Home Job: అందరు ప్రతిరోజు 8 లేదా 9 గంటలు పనిచేస్తే జీతం చెల్లిస్తారు. నిద్రపోతే ఎవ్వరు జీతం ఇవ్వరు. కానీ ఇక్కడ నిద్రపోవడమే ఉద్యోగం. 8 వారాల పాటు నిద్రపోతే 1.5 లక్షల జీతం ఇస్తారు. అవును మీరు విన్నది నిజమే. స్లీప్ జంకీ అనే విదేశీ కంపెనీ మొబైల్ అప్లికేషన్లు, స్లీపింగ్ ఉత్పత్తులను తయారుచేస్తుంది. అవి ఒక వ్యక్తి నిద్రకి ఎలా ఉపయోగపడుతాయో పరిశీలించాలనుకుంటుంది. ఇందుకోసం కొంతమంది ఎంచుకొని 8 వారాల పాటు వారిని అబ్జర్వ్ చేస్తుంది. వారికి 2000 వేల డాలర్ల జీతం చెల్లిస్తారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.5 లక్షల రూపాయలు. ఇందుకోసం కంపెనీయే స్వయంగా కొంతమందిని ఎంపిక చేస్తుంది.
కంపెనీ ఆఫర్ కింద పాల్గొనేవారు రెండు నెలల్లో అన్ని ఉత్పత్తులను ఉపయోగించాలి. నిద్ర కోసం ఆ ఉత్పత్తులు ఎంత ఉపయోగపడుతున్నాయో వారికి తెలియజేయాలి. ఇందుకోసం ఎంపిక చేసిన వ్యక్తులు వారానికి ఒకసారి ఎనిమిది విభిన్న ఉత్పత్తులను ప్రయత్నించే అవకాశాన్ని పొందుతారు. ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు నిద్ర నాణ్యత, పరిమాణంలో ఏమైనా తేడా కనిపించిందో సమీక్షిస్తారు. రివ్యూ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి 2 వేల డాలర్లు చెల్లిస్తుంది. వాస్తవానికి కంపెనీకి దాని యాప్‌లు, ఉత్పత్తులను పరీక్షించడానికి ఇలాంటి వ్యక్తులు అవసరం.
అయితే కంపెనీ నిద్ర సరిగా లేని వ్యక్తులకు ఈ పనిని అప్పగించాలని కోరుకుంటుంది. అలాంటి వారే నిద్ర గురించి ఏం జరగుతుందో చెప్పగలరని నమ్ముతుంది. తద్వారా కంపెనీ ఆ ఫీడ్ బ్యాక్‌ని విక్రయదారులకు తెలియజేయాలని అనుకుంటుంది. ఈ పనికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఫిబ్రవరి 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. దరఖాస్తుదారుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తుదారు ఫిబ్రవరి 28 నుంచి పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. దరఖాస్తుదారు వద్ద స్లీప్ ట్రాకింగ్ యాప్‌లను ఉపయోగించగల స్మార్ట్‌ఫోన్ ఉండాలి.