మంచుతుఫాను ధాటికి అమెరికా, కెనడా గడ్డకట్టుకుపోతున్నాయి. క్రిస్మస్ పండగ వేళ మంచు బీభత్సంతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా ప్రజల్లో ఆశాభావం చిగురింపచేసేలే ఓ యువకుడు చేసిన పని నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కెనడాకు చెందిన సిక్కు ఇన్‌ఫ్లుయెన్సర్ గురుదీప్ పంధేర్ చేసిన సాహసం చూసి అందరూ అభినందిస్తున్నారు. గడ్డ కట్టించే మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో గురుదీప్ ఎంతో హుషారుగా భాంగ్రా నృత్యం చేశాడు. క్రిస్మ సందర్భంగా సంతోషం, ఆశావాదం అనే సందేశాన్ని ఇచ్చేందుకే ఈ సాహసం చేసానంటున్నారు గురుదీప్. ప్రపంచంలోనే అతిశీతల ప్రాంతమైన యుకొన్ పర్వత ప్రాంతంలో అతను భాంగ్రా డాన్స్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ గురుదీప్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు.
అందులో.. ‘అందరికీ నమస్కారం, మాకు ఇది సహజ వాతావరణం.. యుకొన్ నుంచి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఆనందం, నమ్మకం, ఆశాభావవంతో ఉండాలనే సందేశాన్ని పంపిస్తున్నా’ అంటూ గురుదీప్ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు కాగా యుకొన్ ప్రాంతం ప్రపంచంలోనే అతి శీతల ప్రదేశాల్లో ఒకటి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. నీ సానుకూల దృక్పథం, నీ మనసులోని ఉత్సాహం అందరికీ స్ఫూర్తినిస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి స్ఫూర్తిని పంచే ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
From my natural habitat at -30C/-22F temperature in the Yukon, I am sending you Christmas Greetings, joy, hope and positivity!
Watch on YouTube: https://t.co/pQo92pduXJ pic.twitter.com/my5CJ0Zsdv
— Gurdeep Pandher of the Yukon (@GurdeepPandher) December 24, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..