AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన 11 ఏళ్ల బాలిక.. ఎక్స్-రే చూసిన డాక్టర్ల గుండె గుభేల్..!

Shocking X-ray: పంటి నొప్పితో హాస్పిటల్ కి వెళ్లిన 11 ఏళ్ల బ్రెజిలియన్ బాలికకు తీసిన ఎక్స్-రే డాక్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె నోటిలో సాధారణ 32 దంతాలకు బదులుగా కుప్పలు కుప్పలుగా దంతాలు చూసి షాకయ్యారు. దీన్ని హైపర్డోంటియా అంటారు. ఇది అత్యంత అరుదైన పరిస్థితిగా వారు చెబుతున్నారు. అదనపు దంతాలకు డెంటల్ లామినా అతి చురుకుగా ఉండటం లేదా జన్యుపరమైన కారణాలు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ అరుదైన కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన 11 ఏళ్ల బాలిక.. ఎక్స్-రే చూసిన డాక్టర్ల గుండె గుభేల్..!
81 Teeth In 11 Year Old Brazilian Girl
Venkata Chari
|

Updated on: Sep 01, 2026 | 11:31 AM

Share

Shocking X-ray: బ్రెజిల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక పంటి నొప్పితో మినాస్ గెరైస్ రాష్ట్రంలోని జుయిజ్ డి ఫోరా విశ్వవిద్యాలయంలోని దంత వైద్యశాలకు వెళ్ళింది. ఆమెకు ఎక్స్-రే తీసిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా ఎక్స్ రే తీసి చూసి అవాక్కయ్యారు. ఒక మనిషి నోటిలో సాధారణంగా 32 దంతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, కొద్దిమందిలో మాత్రం ఈ లెక్క కొద్దిగా అటు, ఇటు ఉండొచ్చు. అలాగే, చిన్నారుల నోటిలో పాల దంతాలు దాదాపుగా 20 ఉంటాయి. అయితే, తాజాగా బ్రెజిల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక విషయంలో మాత్రం ఓ విచిత్రం చోటు చేసుకుంది. సదరు బాలిక పంటి నొప్పితో వైద్యుడి వద్దకు వెళ్లింది. ఎక్స్-రే తీసిన డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయ్యేలాంటి నిజం బయటపడింది.

ఎక్స్ రే చూసిన డాక్టర్లకు ఆ అమ్మాయి నోటిలో మొత్తం 81 దంతాలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో 18 పాల దంతాలు, 32 శాశ్వత దంతాలతోపాటు 31 అదనపు దంతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని హైపర్డోంటియా అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారిలో దంతాలు అసాధారణ సంఖ్యలో పెరుగుతాయంట. అయితే, 30 కంటే ఎక్కువ దంతాలు ఉండటం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఈ వింత సీన్ 2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్‌లో పబ్లిష్ చేశారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ బాలిక చర్చనీయాంశంగా మారింది.

81 Teeth Brazilian Girl

కాగా, అదనపు దంతాలు రావడానికి గల ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పలేదు. డెంటల్ లామినా అతి చురుకుగా ఉండటం దీనికి కారణమంటూ శాస్త్రవేత్తలు అనుమానపడుతున్నారు. అలాగే, జన్యుపరమైన కారణాలు కూడా కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన కుటుంబ చరిత్ర లేకపోవడం కూడా గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us