
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే మొబైల్‌లో రికార్డ్ చేసి వైరల్ చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో వీడియో తీయడం కంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలన్న కనీస మానవత్వం మరిచిపోతున్నారు. ఇలాంటి ముఖ్యమనే విషయాన్ని గుర్తు చేసే ఘటనలు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైలు వీడియో ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది.
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న రైలు నుంచి బయటకు వేలాడుతూ కనిపిస్తున్నాడు. రైలు డోర్ వద్ద పక్క భాగాన్ని పట్టుకుని అతడు ప్రమాదకరంగా వేలాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదే సమయంలో అతడి కాళ్లు రైలు పట్టాలను తాకుతూ.. బయటకు ఉండి కిందివైపు ఈడ్చుకుపోతున్నట్లు కనిపించడంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది.
అయితే ఈ ఘటనలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన అంశం మరోటి. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించడానికి బదులుగా, చుట్టుపక్కల ఉన్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఎప్పుడు జారిపడతాడో తెలియని పరిస్థితిలో కూడా కెమెరాను అతడిపైనే ఉంచి వీడియో తీయడం విమర్శలకు దారితీసింది.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో వీడియో తీయడం కంటే వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడం, సాధ్యమైనంత సురక్షితంగా అతడిని హెచ్చరించడం, అత్యవసర సహాయం కోరడం అవసరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే ఆ వ్యక్తి కావాలనే విన్యాసం చేశాడా, ప్రమాదవశాత్తు రైలు బయటకు వచ్చాడా, లేక మరేదైనా కారణం ఉందా అనేది ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలియదు. వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారన్న వివరాలు కూడా ధృవీకరించలేదు. ఏదేమైనా, కదులుతున్న రైలుకు వేలాడటం అత్యంత ప్రమాదకరమైన చర్య. కొన్ని క్షణాల నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్ప.
వీడియో ఇక్కడ చూడండి..
जीवन की कीमत समय से ज्यादा है… पता नहीं वह व्यक्ति जीवित है या नहीं… मगर इंसान के भीतर की मरी हुई संवेदना साफ झलकती है
लोग मदद करने की बजाय वीडियो बनाने पर ध्यान दे रहे है आखिर किस दिशा में।जा रहे है हम ? https://t.co/Au1WVsli3q— Malang (@Malanggav4) September 15, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..