Viral: ఎదుట ఎవరున్నారన్నది కాదన్నయ్యా.. మనలో దమ్ము ఎంత అనేదే ముఖ్యం.. రైనో మందకు సుస్సు పోయించిన దుప్పి..

|

Dec 03, 2022 | 3:36 PM

ఆంటీలోప్.. ఇది జింకల జాతికి చెందిన ఒక బలమైన జంతువు. చూడటానికి కొమ్ముల జింక మాదిరిగానే ఉన్నప్పటికీ.. ఇది మరింత బలశాలి. దీనిక ధైర్యం ఎక్కువ. కొమ్ముల జింక..

Viral: ఎదుట ఎవరున్నారన్నది కాదన్నయ్యా.. మనలో దమ్ము ఎంత అనేదే ముఖ్యం.. రైనో మందకు సుస్సు పోయించిన దుప్పి..
Antelope
Follow us on

ఆంటీలోప్.. ఇది జింకల జాతికి చెందిన ఒక బలమైన జంతువు. చూడటానికి కొమ్ముల జింక మాదిరిగానే ఉన్నప్పటికీ.. ఇది మరింత బలశాలి. దీనిక ధైర్యం ఎక్కువ. కొమ్ముల జింక మాదిరిగానే దీనికీ పొడవాటి, పదునైన నిలువు కొమ్ములు ఉంటాయి. వీటికి కోపం అంతే ఎదుట ఉన్ననది ఎంత పెద్ద జంతువు అయినా.. తగ్గేదే లే అని సవాల్ విసురుతుంది. దాంతో పోరాటానికి సై అని కాలు దువ్వుతుంది. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆంటిలోప్.. 4 రైనోలను హడలెత్తించింది. వాటితో పోరాడటమే కాదు.. అవి భయంతో వెనుకడుగు వేసేలా చేసింది.

ఓ పార్క్‌లో నీటి మడుగు ఉంది. దాహం వేయగా ఓ ఆంటిలోప్ నీరు తాగేందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి ఓ రైనో వచ్చింది. ఆ ఆంటిలోప్‌పై దాడి చేసే ప్రయత్నం చేసింది. తన ఒంటి కొమ్ముతో ఆంటిలోప్‌ను కుమ్మే ప్రయత్నం చేసింది. కానీ, అది తగ్గేదేలే అన్నట్లు.. దూసుకెళ్లింది. తన పదునైన కొమ్ములతో రైనో పై అటాక్ చేసింది. ఎదుట ఉన్న భారీ రైనోను భయపెట్టింది. దానిని తరిమికొట్టింది. ఇంతలో మరోవైపు నుంచి 3 రైనోలో ఆంటిలోప్‌పై అటాక్ చేసేందుకు వచ్చాయి. వీటిని సైతం తన మనోబలంతో ధీటుగా ఎదుర్కొంది. మొకాళ్లపై కూర్చుని వాటిని తన కొమ్ములతొ కుమ్ముతూ తరిమి తరిమి కొట్టింది. చూడటానికి చిన్న సైజులో ఉన్నా.. దాని ధైర్యం ముందు పెద్ద పెద్ద రైనోలే జడుసుకుని పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఈ షాకింగ్‌ సీన్‌ను కొందరు పర్యాటకులు వీడియో తీయగా.. ఆ వీడియోను wildwilduniverse అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అంతేకాదు.. స్టాలిన్ చెప్పిన కొటేషన్‌.. ‘నిజమైన యోధుడు తన ప్రత్యర్థి బలాన్ని పరిగణలోకి తీసుకోడు, కానీ తన సంపూర్ణ బలాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు.’ అని క్యాషన్‌గా పెట్టారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను పోస్ట్ చేసి కొన్ని గంటలే అయినా.. ఇందులోని కంటెంట్‌ చూసి చాలామంది నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..