Viral Video: ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో ఎవరం ఊహించలేము. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ప్రమాదాలు చెప్పాపెట్టకుండా దూసుకువస్తాయి. కొన్ని సార్లు ఈ ప్రమాదాలు ప్రాణాలకు మీదకు తీసుకువస్తాయి. అయితే కొండంత ప్రమాదాన్ని కూడా చిన్న అదృష్టం కాపాడుతుందని చెబుతుంటారు. తాజాగా ఓ కుటుంబాన్ని అదృష్టమే కాపాడింది. భయాన్ని కలిగిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా.
వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హాల్‌లో కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. అంతా మాట్లాడుకుంటూ సరదాగా ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే పైన గిర గిరా తిరుగుతోన్న సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా కిందపడింది. అంత వేగంతో ఫ్యాన్ పడితే కింద కూర్చున్న వారి తలలు పగిలిపోయుంటాయని అనుకుంటున్నారు కదూ..! సాధారణంగా అయితే అలాగే జరుగుతుంది. కానీ ఈ ఫ్యామిలీకి అదృష్టం ఎక్కువ ఉన్నట్లుంది.. అందుకే అంత వేగంగా కింద పడ్డప్పటికీ సరిగ్గా మధ్యలో పడింది.
ఆ ఆరుగురిలో ఒక్కరికి కూడా ఒక చిన్న గీటు కూడా పడకపోవడం నిజంగానే వండర్‌లా అనిపిస్తోంది. ఒక్క క్షణం ఆలస్యమైనా, కొంచెం అటు ఇటు అయినా ఫ్యాన్ తలపై పడడం, వారి గాయమయ్యేది కానీ టైమ్ బాగుండడంతో క్షేమంగా తప్పించుకున్నారు. ఇదంతా ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఈ ఫ్యామిలీ చాలా అదృష్టవంతులు, ఈ కుటుంబానికి ఈ భోజనం జీవితమంతా గుర్తుండిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Pizza Delivery: ఆయన ఓ మాజీ ఐటీ మంత్రి.. ఇప్పుడు సైకిల్ పై పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు!
Health Tips: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..
మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!