Viral Video: ఇది కదా వీర కుమ్ముడు అంటే.. సింహానికి సుస్సు పోయించిన అడవి దున్న.. వీడియో చూస్తే షాకే..!

Viral Video: ఒకరు సింహానికి ఎదురెళ్లినా.. సింహం ఒకరికి ఎదురెళ్లినా రిస్క్ ఎదుటి వారికే. అవును మరి.. సింహం కంట పడ్డ ఏ ప్రాణమైనా గాల్లో కలవడాల్సిందే.

Viral Video: ఇది కదా వీర కుమ్ముడు అంటే.. సింహానికి సుస్సు పోయించిన అడవి దున్న.. వీడియో చూస్తే షాకే..!
Wild Life
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 23, 2022 | 5:30 PM

Viral Video: ఒకరు సింహానికి ఎదురెళ్లినా.. సింహం ఒకరికి ఎదురెళ్లినా రిస్క్ ఎదుటి వారికే. అవును మరి.. సింహం కంట పడ్డ ఏ ప్రాణమైనా గాల్లో కలవడాల్సిందే. అందుకే కదా.. సింహాన్ని మృగరాజు అంటారు. సింహం గర్జిస్తే ఆ శబ్ధం.. దాదాపు 5 మైళ్ల వరకు వినిస్తుందట. సింహం అలికిడి వినిపిస్తే చాలు.. అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాయి. అయితే, సింహం ఎంత శక్తిశాలి అయినప్పటికీ.. దృఢ సంకల్పం, తనపై తనకు నమ్మకం ఉంటే సింహాన్ని సైతం ఎదురించి అదిరించొచ్చని నిరూపించింది ఓ అడవి దున్న. అంతేకాదు.. సింహానికి చుక్కలు చూపిస్తూ ఉరికించింది. అవునండీ బాబూ.. ఒక విధంగా చెప్పాలంటే అడవికి రారాజైన సింహానికి సుస్సు పోయించిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ అడవి దున్నపై సింహం దాడి చేసింది. మృగరాజు దాడిలో తీవ్రంగా గాయపడి కుప్పకూలిన దున్నను.. మరో దున్న గమనించింది. ఏంటో చూద్దాం అనుకుని దగ్గరకు వెళ్లింది. అక్కడ సింహం కనిపించండంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఇక.. ఒక్క ఉదుటున సింహంపై దూకేసింది అడవి దున్న. నా స్నేహితుడిపైనే దాడి చేస్తావా? అన్నట్లుగా ఫుల్ ఫైర్‌తో సింహాన్ని వీర కుమ్ముడు కుమ్మేసింది. కొమ్ములతో పైపైకి ఎగరేస్తూ మరీ దాడి చేసింది. దున్న దాడికి బిత్తరపోయిన సింహం.. బెంబేలెత్తిపోయింది. ఇదేదో డేంజర్‌గా ఉందే అనుకుని, అక్కడి బతుకు జీవుడా అంటూ భయంతో పరుగు తీసింది.

కాగా, సింహాన్ని దున్న కుమ్మేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా సెన్షేషనల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇదెందయా ఇది.. దీన్ని మేమెప్పుడూ చూడలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే సింహం ఏంటి? దేన్నైనా ఎదిరించొచ్చని ఈ అడవి దున్న నిరూపించిందని కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..