ప్రస్తుతం చాలామంది ప్రజలు చదువులని, ఉద్యోగాలని విదేశాల్లోకి వెళ్లిపోతున్నారు. కొంతమందైతే అక్కడే స్థిరపడిపోతున్నారు. అయితే విదేశాల్లోని ఉన్న ఖర్చులకు ఇక్కడి ఖర్చులకు చాలా తేడా ఉంటుంది. షాపింగ్ చేసిన, బయట ఎమైన తిన్నా, వైద్యం చేయించుకున్న ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే భారత్ కు చెందిన ఓంకార్ ఖండేకర్ అనే యువకుడు లండన్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. అయితే ఓ రోజు అక్కడ కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లాడు. కానీ అక్కడ ఉన్న రేట్లను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.
మనదేశంలో సాధరణంగా కేజీ దొండకాయ ధరలు నాణ్యతను బట్టి 30 నుంచి 60 రూపాయల వరకు ఉంటాయి. కానీ లండన్ లో మాత్రం కేజీ దొండకాయ రూ.900. ఒక కిలో దొండకాయల ధర 8.99 పౌండ్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.919. ఈ ధర చూసి షాకైన ఆ యువకుడు దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో బెండకాయ, టమాటా లాంటి మరికొన్ని కూరగాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ యువకుడు చేసిన పోస్ట్ వైరలవుతోంద్. ఆ ధరలను చూసిన నెటీజన్లు షాక్ అవుతూ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..