నన్ను ప్రధాని చేయండి.. భారత్ పై అణు బాంబ్ వేస్తా.. బ్రిటిష్ యూట్యూబర్ ప్రకటన

|

Aug 23, 2024 | 3:28 PM

సోషల్ మీడియా X లో తనకు వచ్చిన బెదిరింపు సందేశాలు భారతీయుల నుంచి వచ్చి ఉండవచ్చని రౌట్‌లెడ్జ్ భావించాడు. దీంతో అతను జాతిపరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. తనను వేటాడతామని భారతీయులు బెదిరించారని రౌట్‌లెడ్జ్ కామెంట్ ద్వారా తెలిపాడు. దీంతో పాటు తన లొకేషన్, తను ధరించిన దుస్తుల వివరాలను తెలియజేస్తూ తనను వెతికి పట్టుకోవాలంటూ ట్రోల్స్‌కు సవాలు విసిరాడు. అప్పటి నుండి ఈ పోస్ట్‌ను 50 లక్షలకు పైగా చూశారు.

నన్ను ప్రధాని చేయండి.. భారత్ పై అణు బాంబ్ వేస్తా..  బ్రిటిష్ యూట్యూబర్ ప్రకటన
British Youtuber
Image Credit source: X/@real_lord_miles
Follow us on

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట్లో రకరకాల వీడియోలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కొంతమంది తమ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందుతున్నారు. అయితే అలా పేరు గుర్తింపు వచ్చిన తర్వాత నోటికి పని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడి వివాదాలకు దారి తీసుకున్నారు కూడా.. తాజాగా బ్రిటీష్ కి చెందిన యూట్యూబర్ మైల్స్ రౌట్‌లెడ్జ్ మాట్లాడుతూ భారత్‌పై అణుబాంబు వేస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా వేదికగా హాస్యభరితమైన ఓ మీమ్ వీడియోను షేర్ చేశాడు.

యూట్యూబర్ రూట్లెడ్జ్ ఈ వీడియోను షేర్ చేస్తూ తాను ఇంగ్లండ్ కి ప్రధాని కాగానే అణు బాంబులు దాచిన ప్లేస్ ను తెరుస్తానని.. బ్రిటీష్ దేశ ప్రయోజనాలకు, వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి విదేశీ శక్తులనైనా నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. కొంత సమయం తర్వాత రౌట్‌లెడ్జ్ ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించాడు.. బహుశా నేను అణుబాంబుని భారతదేశంలో కూడా వేయాలని కోరుకుంటున్నానని.. ఇంకా చెప్పాలంటే అసలు తాను ప్రధాని అయితే అణు బాంబు తీసి మొదట భారతదేశంపైనే వేసి అణుదాడిని ప్రారంభిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రూట్లెడ్జ్ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. దీంతో రూట్లెడ్జ్ తన వ్యాఖ్యను సోషల్ మీడియా నుంచి తొలగించింది.

ఇవి కూడా చదవండి

తాను ఇంగ్లండ్ ప్రధాన మంత్రి అయ్యాక బ్రిటీష్ ఆస్తులకు, వ్యవహారాలకు ఆటంకం కలిగించే ఏదైనా విదేశీ శక్తిపైన అయినా అణు దాడి చేస్తామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తున్నట్లు వెల్లడించాడు.

యూట్యూబర్ ఇప్పుడు తొలగించిన వ్యాఖ్య ఇది

British Youtuber Miles Rout

ఈ వివాదాస్పద పోస్ట్ తర్వాత, బ్రిటిష్ యూట్యూబర్ తీవ్ర విమర్శలు, బెదిరింపులను ఎదుర్కోవలసి వచ్చింది.  సోషల్ మీడియా X లో తనకు వచ్చిన బెదిరింపు సందేశాలు భారతీయుల నుంచి వచ్చి ఉండవచ్చని రౌట్‌లెడ్జ్ భావించాడు. దీంతో అతను జాతిపరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయులను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. తనను వేటాడతామని భారతీయులు బెదిరించారని రౌట్‌లెడ్జ్ కామెంట్ ద్వారా తెలిపాడు. దీంతో పాటు తన లొకేషన్, తను ధరించిన దుస్తుల వివరాలను తెలియజేస్తూ తనను వెతికి పట్టుకోవాలంటూ ట్రోల్స్‌కు సవాలు విసిరాడు. అప్పటి నుండి ఈ పోస్ట్‌ను 50 లక్షలకు పైగా చూశారు.

దీని తర్వాత YouTuber Rutledge తన విభిన్న పోస్ట్‌లలో ట్రోలర్‌లతో తన సంభాషణల స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నాడు. వారి ప్రొఫైల్‌ల వివరాలను చూపించాడు. అదే సమయంలో, ఒక భారతీయ వినియోగదారు తనను కోపాన్ని రెచ్చగొట్టారని ఆరోపించినప్పుడు, రట్లెడ్జ్ తనకు భారతదేశం అంటే ఇష్టం లేదని అందుకే బెదిరింపు చేసే వ్యక్తి భారతీయుడే కావచ్చునని అనుకున్నానని చెప్పాడు.

 

అయితే, బ్రిటీష్ యూట్యూబర్ తాజా చర్య సోషల్ మీడియాలో చాలా దుమారం రేపింది. రూట్లెడ్జ్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఇంతకుముందు రట్లెడ్జ్.. తనకు పునర్జన్మ లభిస్తే ఖచ్చితంగా వైరస్ గా జన్మ కావాలని… అప్పుడు భారతదేశం, ఆఫ్రికాలో పెరుగుతున్న జనాభాకు వ్యాపించి తద్వారా జనాభా పెరుగుదలను పరిష్కరించడం ద్వారా మానవాళికి దోహదపడతానని చెప్పాడు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..