Viral Video: ఈ యువతికి పొడవు ఒక వరం.. బాస్కెట్ బాల్ కోర్టులో అడుగు..

|

Jun 27, 2024 | 12:06 PM

గత వారం చైనా తరఫున అరంగేట్రం చేసిన జాంగ్.. తన అద్భుతమైన ఎత్తుతో చాలా లాభపడింది. సోషల్ మీడియా ఆమె మేకింగ్ పాయింట్‌లను చూపించే వీడియోలతో నిండిపోయింది. అంతేకాదు జియు చాలా సులభంగా రీబౌండ్‌లు పొందుతున్నారు. CNN ప్రకారం ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) ఆట ముగిసిన తదనంతరం జియుకి సంబంధించిన గేమ్ హైలైట్‌ల వీడియోను విడుదల చేసింది. ఆమె ప్రత్యర్థులపైకి దూసుకుపోతున్నట్లు చూపించింది.

Viral Video: ఈ యువతికి పొడవు ఒక వరం.. బాస్కెట్ బాల్ కోర్టులో అడుగు..
Chinese Girl Zhang Ziyu
Follow us on

జాంగ్ జియు చైనీస్ కళాశాల బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ప్రస్తుతం కొనసాగుతున్న FIBA ​​U18 మహిళల ఆసియా కప్ 2024 ప్రచారంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది.   7 అడుగుల 3 అంగుళాల పొడవు ఉన్న జాంగ్ 17 ఏళ్ల క్రీడాకారిణి బాస్కెట్ బాల్ గేమ్‌లో తొలిసారిగా కనిపించింది. ఇప్పటికే తన క్రీడా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది. జియూ అసాధారణ ఎత్తు కారణంగా తరచుగా NBA లెజెండ్ యావో మింగ్‌తో పోలుస్తున్నారు. అందుకే బాస్కెట్ బాల్ అభిమానులు జియూ గురించి మరింత తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు.

గత వారం చైనా తరఫున అరంగేట్రం చేసిన జాంగ్.. తన అద్భుతమైన ఎత్తుతో చాలా లాభపడింది. సోషల్ మీడియా ఆమె మేకింగ్ పాయింట్‌లను చూపించే వీడియోలతో నిండిపోయింది. అంతేకాదు జియు చాలా సులభంగా రీబౌండ్‌లు పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

CNN ప్రకారం ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) ఆట ముగిసిన తదనంతరం జియుకి సంబంధించిన గేమ్ హైలైట్‌ల వీడియోను విడుదల చేసింది. ఆమె ప్రత్యర్థులపైకి దూసుకుపోతున్నట్లు చూపించింది. ఆ యువతి బంతిని ట్రిపిల్ చేయకుండా తన ఎత్తు వలన కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని .. దూరం నుంచే బాస్కెట్ లో బాల్ వేయడానికి షూటింగ్ ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తోంది. అపోజిట్ ఆటగాళ్ళ రక్షణ వలయాన్ని చాలా సులభంగా చేదిస్తోంది.

జాంగ్ జియు ఎవరు? NBA లెజెండ్ యావో మింగ్‌తో ఎందుకు పోలుస్తున్నారు

జాంగ్ జియు కాలేజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన యువతి. తల్లిదండ్రుల జీన్స్ ప్రకారం జియు కూడా మంచి పొడవుగా ఎదిగింది. ఆమె తండ్రి 2.13 మీటర్లు, తల్లి 1.98 మీటర్ల ఎత్తు. అయినప్పటికీ జియు తల్లిదండ్రులు ఇద్దరూ జియు కంటే పొట్టిగా ఉన్నారు.

టైమ్స్ నివేదిక ప్రకారం జియు ఫస్ట్ క్లాస్ చదివే సమయమలో 5’3 పొడవు ఉంది. ఇక ఆమె ఆరవ తరగతికి చేరున్న సమయంలో 6.10 పొడవుకు చేరుకుంది. దీంతో తన తల్లిదండ్రుల బాస్కెట్‌బాల్ అభిరుచిని జియూ కూడా అనుసరిస్తూ తాను కూడా బాస్కెట్ బాల్ కోర్టు లో అడుగు పెట్టింది. జియూ తల్లి సీనియర్ అంతర్జాతీయ క్రీడాకారిణి.

ప్రస్తుతం జియు FIBA ​​U18 మహిళల ఆసియా కప్‌లో ఆడని అత్యంత పొడవైనది. జియు మొదటిసారిగా 2021 చైనీస్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో వెలుగులోకి వచ్చింది. అక్కడజియు 42 పాయింట్లు, 25 రీబౌండ్‌లు. ఆరు బ్లాక్‌లతో అందరిని ఆకట్టుకుంది. ఇతర క్రీడాకారుల కంటే అత్యంత పొడవైనది. అందువల్ల ఆమె త్వరగా చర్చనీయాంశంగా మారింది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..