Polar Bears: కరిగిపోతున్న మంచు.. ఆకలితో కనుమరుగవుతున్న ఇలాంటి అరుదైన జీవజాతులు.. కారణం మీకూ తెలుసు..!

|

Feb 24, 2024 | 12:30 PM

ధృవపు ఎలుగుబంటి చర్మం తెల్లగా పాలవలే ఉంటుంది. ఒల్లంతా తెల్లటి వెంట్రుకల కుదుళ్లతో కప్పబడి ఉండటం వల్ల మంచులో వాటిని అంత ఈజీగా గుర్తు పట్టలేరు. ధృవపు ఎలుగుబంట్లు సాధారణ ఎలుగుబంట్ల కంటే పొడవైన కాళ్ళు, పొడవైన సన్నని మెడ కలిగి ఉంటాయి. వాటి సాధారణ జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు. వీటి ప్రధాన ఆహారం సీల్స్, చేపలు.

Polar Bears: కరిగిపోతున్న మంచు.. ఆకలితో కనుమరుగవుతున్న ఇలాంటి అరుదైన జీవజాతులు.. కారణం మీకూ తెలుసు..!
Polar Bears
Follow us on

వాతావరణ మార్పుల కారణంగా ధృవపు ఎలుగుబంట్లు ఆకలితో చనిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనడాలోని హడ్సన్ బే ప్రాంతంలోని ధృవపు ఎలుగుబంట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొటున్నాయి. ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ సముద్రపు మంచు విస్తృతంగా కనుమరుగవుతోంది. మంచు పొరలు ధృవపు ఎలుగుబంట్ల ఆహారం సీల్స్‌ సహా చేపల వేటాడేందుకు సహాయపడతాయి. కానీ, కరిగిపోతున్న మంచు కారణంగా ధ్రువ ఎలుగుబంటి వేటను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అంతరించిపోతున్న జాతులలో ధ్రువపు ఎలుగుబంటి ఒకటి. ప్రపంచంలోని 25,000 ధృవపు ఎలుగుబంట్లు తమ సహజ ఆవాసాలలో నివసిస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల వీటి మనుగడకు ముప్పు పొంచి ఉంది.. మంచు కనుమరుగవకుండా ఆపడం కంటే ధృవపు ఎలుగుబంట్లను కాపాడుకోవడానికి మరో పరిష్కారం చూడాల్సిన అత్యవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎలుగుబంటి జాతులు ధృవపు ఎలుగుబంట్లు. వీటిని తెల్లటి ఎలుగుబంట్లు అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా రష్యా, కెనడా, డెన్మార్క్ మరియు నార్వే వంటి దేశాల్లో కనిపిస్తాయి. ధృవపు ఎలుగుబంటి చర్మం తెల్లగా పాలవలే ఉంటుంది. ఒల్లంతా తెల్లటి వెంట్రుకల కుదుళ్లతో కప్పబడి ఉండటం వల్ల మంచులో వాటిని అంత ఈజీగా గుర్తు పట్టలేరు. ధృవపు ఎలుగుబంట్లు సాధారణ ఎలుగుబంట్ల కంటే పొడవైన కాళ్ళు, పొడవైన సన్నని మెడ కలిగి ఉంటాయి. వాటి సాధారణ జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు. వీటి ప్రధాన ఆహారం సీల్స్, చేపలు.

పూర్తిగా పెరిగిన ధృవపు ఎలుగుబంటి బరువు 150 నుంచి 300 కిలోల మధ్య ఉంటుందని అంచనా. ప్రపంచంలోని 60 నుండి 80 శాతం ధృవపు ఎలుగుబంట్లు కెనడాలో ఉన్నాయి. నేడు ప్రపంచంలో దాదాపు 31,000 ధ్రువ ఎలుగుబంట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..