Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. రస్క్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారా..? ఈ వీడియో చూస్తే ఏమంటారో చెప్పండి..

ఈ రస్క్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా చేస్తే మనకు ఇష్టమైన స్నాక్స్ ఎలా తినగలమంటూ కొందరు ప్రశ్నించగా, ఇది ముందుగా ఫ్యామిలీకి చూపించాలి.. మా ఇంట్లో ఎప్పుడూ రస్క్ మాత్రమే తింటారు అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

ఆహా.. రస్క్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారా..? ఈ వీడియో చూస్తే ఏమంటారో చెప్పండి..
Rusk Making
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2023 | 5:46 PM

ఇంటి బయట కొనే ఏ ఆహారపదార్థమైనా పరిశుభ్రంగా తయారైందని మనం ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఎక్కువగా మార్కెట్లో అమ్ముడయ్యే ఆహారాన్ని పెద్ద పరిమాణంలో తయారుచేయడం వలన పరిశుభ్రతపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పెద్దమొత్తంలో తయారుచేయడం వల్ల ఆహారాన్ని తయారుచేసే ప్రదేశం, ఆహారాన్ని తయారుచేసే విధానం అంతా కొంతమేరకు అపరిశుభ్రంగానే ఉంటాయి. ఇలాంటి ఫుడ్ మేకింగ్ వీడియో ఇంతకు ముందు కూడా వైరల్ అయ్యాయి. పానీపూరీ, పచ్చి బఠానీలు, ఉప్పు శనగలు వంటివి తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో మనం గతంలోనే చూశాం. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అలాగే చాలా మందికి ఇష్టమైన చిరుతిండి రస్క్‌ను తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

రస్క్‌ తయారీలో కార్మికులు మొదట పిండిని తెచ్చి మిక్సర్‌లో పోస్తారు. అప్పుడు ఒక బకెట్‌తో ఒక యంత్రానికి నీరు కలుపుతారు. అది కలిపిన వెంటనే నూనె తెచ్చి పోస్తారు. తర్వాత ఈ పిండిని తీసుకొచ్చి ఒక చోట కుప్పలుగా పోస్తారు. అప్పుడు వారు ఒట్టి చేతులతో పిండిని బాగా కొట్టడం ద్వారా ఈ పిండిని మరింతగా పిసికి కలుపుతారు. అప్పుడు పిండిని దీర్ఘచతురస్రాకారంలోకి మలిచి బేకింగ్ మెషిన్‌లో పోస్తారు. ఆ తర్వాత పిండిని బేకింగ్‌ యంత్రంలోకి నెడుతున్నారు. లోపలికి వచ్చిన తరువాత వారు దానిని బయటకు తీసి కత్తిరించారు.

ఇవి కూడా చదవండి

కార్మికులు కనీసం చేతులకు గ్లౌజులు కూడా ధరించకుండా ఒట్టి చేతులతో ఈ రస్క్ మేకింగ్ పనులు చేస్తున్నారు. పిండిని చేతితో పిసికి కలుపుతున్నారు. ఆ పిండిని బ్రెడ్‌ ఆకృతి చేసే ప్రక్రియ కూడా చేతులతోనే చేస్తున్నారు. ఆ తరువాత కూడా ఒట్టి చేతులతోనే ఒక యంత్రం నుంచి మరొక యంత్రానికి మారుస్తున్నారు. మొత్తం రస్క్ ప్రక్రియలో ఎక్కడా పరిశుభ్రత పాటించకపోవడం గమనించవచ్చు.

View this post on Instagram

A post shared by Tharangan (@_tharangan)

ఈ రస్క్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా చేస్తే మనకు ఇష్టమైన స్నాక్స్ ఎలా తినగలమంటూ కొందరు ప్రశ్నించగా, ఇది ముందుగా ఫ్యామిలీకి చూపించాలి.. మా ఇంట్లో ఎప్పుడూ రస్క్ మాత్రమే తింటారు అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. కాగా, మరికొందరు మాత్రం మీ ఇంట్లో కూడా చేతులకు గ్లౌజులు వేసుకునే వంటచేస్తారా..? అంటూ కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..