Rats Rain Viral: కరోనాతో ఇప్పటికే హడలెత్తిపోతున్న జనాలకు.. మరో దిమ్మతిరిగే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. ఉన్న కరోనా నుంచే ఎలా బయటపడాలా.? అంటూ కుయ్యో మొర్రో అంటున్న ప్రజలు.. ఇప్పుడు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం ఆస్ట్రేలియాలో జరిగిన ఓ విచిత్రమైన సంఘటన.
ఆకాశం నుంచి ఎలుకల వర్షం కురుస్తున్న ఒక వీడియో నెటిజన్లను హడలెత్తిస్తోంది. ఓ సాయంత్రం సమయంలో.. ఆకాశం నుంచి భారీ మొత్తంలో ఎలుకలు పడ్డాయి. ఆ ఎలుకలు.. కొంచెం భిన్నంగా అలాగే చాలా చిన్న సైజులో ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. గత రెండు, మూడు రోజుల నుంచి ఈ ఎలుకలు పడుతూనే ఉన్నాయని.. ఆందోళన చెందుతున్నారు ఆస్ట్రేలియా వాసులు.
కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎలుకలు వర్షం పడిందని భ్రమపడ్డారని అధికారులు చెబుతున్నారు. ధాన్యం నిల్వ ఉంచిన చోటు నుంచి వచ్చే గొట్టం యంత్రాన్ని శుభ్రపరుస్తుండగా అందులో నుంచి ఈ చచ్చిన ఎలుకలు కుప్పలుగా గాల్లోంచి కింద పడినట్లు తెలిపారు. మరోవైపు ఓ జర్నలిస్ట్ ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఎలుకల వర్షం అని క్యాప్షన్ పెట్టాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఇదో కొత్త రకమైన ముప్పు కావొచ్చని పప్పులో కాలేశారు. తీరా నిజం తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.
Also Read:
ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..
‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!
Even if grain’s in silos, mice can get to it. Like Tyler Jones discovered in Tullamore when cleaning out the auger and it started raining mice #mouseplague #mice #australia pic.twitter.com/mWOHNWAMPv
— Lucy Thackray (@LucyThack) May 12, 2021