AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రెండు తలలు, నాలుగు కళ్ల వింత పామును చూసారా?

గుజరాత్‌లోని దహోద్‌ జిల్లాలో అరుదైన పాము కనిపించింది. ఒకే శరీరానికి రెండు తలలు, నాలుగు కళ్లు ఉన్న పామును ధన్‌పూర్‌ అటవీ పరిధిలోని అగస్వానీ గ్రామస్థులు దీనిని గమనించి దహోద్ ప్రకృతి మిత్ర మండల్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వన్యప్రాణి అధికారులు అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా రక్షించారు. ఈ వింత, అరుదైన పాము విషపూరితం కాదనీ దీనిని వుల్ఫ్‌ స్నేక్‌గా పిలుస్తారనీ తెలిపారు.

Video: రెండు తలలు, నాలుగు కళ్ల వింత పామును చూసారా?
Rare Two Headed Four Eyed Snake Rescued In Gujarat
Sharada V
|

Updated on: Oct 07, 2026 | 9:57 PM

Share

గుజరాత్‌లో రెండు తలల పామును రక్షించడం ఇదే తొలిసారనీ వన్యప్రాణి అధికారులు అన్నారు. భారత్‌లో కూడా ఇలాంటి ఘటనలు తక్కువగా నమోదయ్యాయనీ దేశంలో ఇప్పటివరకు రెండు తలల నాగుపాములు రెండు, వుల్ఫ్ స్నేక్‌లు మూడు లభ్యమైనట్లు చెప్పారు. రక్షించిన పాముకు ఏడాది వయసు ఉంటుందని అంచనా వేసారు. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ, సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

‘బైసెఫలీ’ కారణంగా రెండు తలలు

కేవలం ఆరు అంగుళాల పొడవు ఉన్న ఈ పాములో ఒకే శరీరానికి రెండు వేర్వేరు తలలు ఉన్నాయి. ఒక్కో తలకు రెండు కళ్లతో మొత్తం నాలుగు కళ్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి శరీర నిర్మాణాన్ని వైద్య, జీవశాస్త్ర పరిభాషలో ‘బైసెఫలీ (Bicephaly)’ అంటారు. పిండం అభివృద్ధి చెందే సమయంలో శరీరం సాధారణంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల కొన్ని జంతువుల్లో రెండు తలలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పాములు, ఇతర సరీసృపాల్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు నమోదైనప్పటికీ.. ఇది చాలా అరుదైన పరిస్థితి అని అధికారులు చెబుతున్నారు.

రెండు తలల పాముకు ఎలాంటి ఇబ్బందులు?

రెండు తలలు ఉండటం వల్ల ఈ పాము అడవిలో జీవించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రెండు తలలు ఆహారం, కదలిక,  ప్రమాదం విషయంలో స్వతంత్రంగా స్పందిస్తుంది. దీంతో ఒక్కో తల ఒక్కో దిశగా కదిలి, భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆహారం తీసుకోవడం, కదలడం, శత్రువుల నుంచి తప్పించుకోవడం కష్టంగా మారుతుంది.  అయితే రెండు తలల పాము ఎంతకాలం జీవిస్తుంది అనేది దాని శారీరక స్థితి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ లోని దహోద్‌లో రక్షించిన ఈ అరుదైన పామును అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

Follow Us