AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! చూస్తేనే భయమేస్తోంది.. చేపల కోసం వల వేస్తే ఇది దొరికింది.. చూస్తే ఫ్యూజులు ఔట్!

సాంప్రదాయ మత్స్యకారుల జీవితం ప్రతీ రోజూ ఓ పోరాటమే. గంపెడు ఆశలతో ఒక్కసారి నడి సముద్రంలోకి వెళ్తే.. వలకు దండిగా చేపలు..

Viral Video: వామ్మో! చూస్తేనే భయమేస్తోంది.. చేపల కోసం వల వేస్తే ఇది దొరికింది.. చూస్తే ఫ్యూజులు ఔట్!
Fish
Ravi Kiran
|

Updated on: Mar 16, 2022 | 10:39 AM

Share

సాంప్రదాయ మత్స్యకారుల జీవితం ప్రతీ రోజూ ఓ పోరాటమే. గంపెడు ఆశలతో ఒక్కసారి నడి సముద్రంలోకి వెళ్తే.. వలకు దండిగా చేపలు చిక్కితేనే గానీ తిరిగి ఒడ్డుకు రారు. ఒక్కోసారి వారం రోజులైనా కూడా తీరానికి తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇంకొన్ని సార్లయితే వలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. ఇక ఇదే తరహాలో కర్ణాటకలోని మల్పెకి చెందిన పలువురు జాలర్ల వలకు ఓ అరుదైన చేప చిక్కింది.

అసలు విషయానికొస్తే.. కర్ణాటకలోని మల్పె ప్రాంతంలో పలువురు జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా.. వారి వలకు అరుదైన జాతికి చెందిన రంపపు చేప(Saw Fish) చిక్కింది. సుమారు 250 కేజీల బరువున్న ఈ చేపను జాలర్లు బోటులో ఒడ్దుకు తీసుకొచ్చి లారీ ద్వారా మంగళూరుకు తరలించారు. ఈ చేప నోరు 10 అడుగుల పొడువైన రంపం లాగ ఉంది. దీనిని చూసేందుకు స్థానికులు బారులు తీరగా.. ఈ రంపపు చేపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జాతికి చెందిన చేపలు అంతరించే దిశకు చేరుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రంపపు చేపను డీప్ సీ ఫిషింగ్ బోట్ ‘సీ కెప్టెన్’లో మత్స్యకారులు పట్టుకున్నారు. దీనిని మల్పె ఫిషరీస్ హార్బర్‌కు తీసుకొచ్చి మంగళూరు వ్యాపారికి విక్రయించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ గణేష్ జాతీయ మీడియాకు వెల్లడించారు.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!