Viral Video: పాము, కుందేలు మధ్య భీకర పోరు.. ఎవరు గెలిచారో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

Rabbit vs Snake: మనం ఎక్కువగా పాము, ముంగిసల పోరును చూస్తుంటాం. సోషల్ మీడియాలోనూ వీటికి సంబంధించిన వీడియోలు బోలెడు ఉంటాయి. అయితే ప్రమాదకరమైన పాముతో, సాధుజంతువైన కుందేలు పోట్లాడడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడండి.

Viral Video: పాము, కుందేలు మధ్య భీకర పోరు.. ఎవరు గెలిచారో చూస్తే ఆశ్చర్యపోతారంతే..
Rabbit Vs Snake

Updated on: Sep 06, 2022 | 11:37 AM

Rabbit vs Snake: మనం ఎక్కువగా పాము, ముంగిసల పోరును చూస్తుంటాం. సోషల్ మీడియాలోనూ వీటికి సంబంధించిన వీడియోలు బోలెడు ఉంటాయి. అయితే ప్రమాదకరమైన పాముతో, సాధుజంతువైన కుందేలు పోట్లాడడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడండి. ఇందులో ఒక కుందేలు ఏకంగా పాముపై దండయాత్ర చేసింది. పదే పదే దాడులు చేస్తూ పామును పరుగులు పెట్టించింది. కుందేలు పోరు పడలేక చివరకు పాము అక్కడి నుంచి పారిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. claggies.v1 అనేపేరు గల ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈవీడయోను చూసిన నెటిజన్లు కుందేలు ధైర్యానికి ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాము, కుందేలు మధ్య భీకర పోరు జరగడం మనం చూడవచ్చు. ఆశ్చర్యకరంగా కుందేలు వంటి సాధు జంతువు విషపూరిత పాముపై పదే పదే దాడులు చేస్తుంది. పాము తప్పించుకోవాలని ప్రయత్నించినా విడిచిపెట్టదు. వెంబడించి మరీ దాడి చేసింది. దీంతో పాము నిస్సహాయంగా మారిపోతుంది. చివరకు తన ప్రాణాలు దక్కించుకునేందుకు వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది. కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కుందేలు దండయాత్ర అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కుందేలు, పాము మధ్య జరిగిన ఫైట్‌ వీడియోను ఇక్కడ చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us