Chicken Biryani: చికెన్ బిర్యానీ ఇష్టమా.. లేజీ గర్ల్ రెసిపీని ట్రై చేయండి.. తక్కువ సమయంలోనే రెడీ..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'లేజీ గర్ల్' బిర్యానీ రెసిపీ కేవలం 30 నిమిషాల్లోనే తయారవుతుంది. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ సమయం లేదా ఎక్కువ శ్రమ అవసరం లేదు. మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు . కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఈ రుచికరమైన బిర్యానీని ఆస్వాదించవచ్చు.

Chicken Biryani: చికెన్ బిర్యానీ ఇష్టమా.. లేజీ గర్ల్ రెసిపీని ట్రై చేయండి.. తక్కువ సమయంలోనే రెడీ..
Chicken Biryani

Updated on: Jun 03, 2025 | 8:45 PM

వంటగదిలో గంటల తరబడి గడపడం ఇష్టపడని వారిలో మీరు కూడా ఒకరా? అయినా సరే బిర్యానీ తినడం అంటే ఇష్టమా.. అయితే ఇది మీ కోసమే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘లేజీ గర్ల్’ బిర్యానీ రెసిపీ కేవలం 30 నిమిషాల్లోనే సిద్ధమవుతుంది. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ సమయం లేదా ఎక్కువ శ్రమ అవసరం లేదు. మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ టేస్టీ టేస్టీ బిర్యనీని హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఈ వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఈ చికెన్ బిర్యానీ రెసిపీ ఆరుగురికి సరిపోతుంది. కనుక బిర్యానీ తినాలనిపిస్తే ఈ చికెన్ బిర్యనీని ట్రై చేయండి.. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ బిర్యానీ రుచిని ఆనందించండి.

చికెన్ బిర్యానీకి కావలసిన పదార్ధాలు:

చికెన్ బ్రెస్ట్- 2

ఇవి కూడా చదవండి

బాస్మతి బియ్యం- 3 కప్పులు

బంగాళాదుంప- 2

టమోటా- 2

అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1 టేబుల్ స్పూన్

పచ్చి మిరపకాయలు- 5

బిర్యానీ మసాలా (మీకు నచ్చినది)- 1 ప్యాకెట్

ఉప్పు- రుచికి సరిపడా

కారం- 1 స్పూన్

పసుపు – 1/2 స్పూన్

దాల్చిన చెక్క- కొంచెం

యాలకులు- 4

వెన్న- 1 టేబుల్ స్పూన్

పెరుగు- 2 టేబుల్ స్పూన్

పుదీనా- కొంచెం

కొత్తిమీర- కట్ట

వేయించిన ఉల్లిపాయలు- 1 కప్పు

మసాలా దినుసులు- 1 టేబుల్ స్పూన్

బిర్యానీ ఆకు- 1

 

తయారీ విధానం:

1. ముందుగా ఉల్లిపాయలను సన్నగా నిలువుగా కోసి.. అవి క్రిస్పీగా, ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.

2. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. మసాలా దినులుసులు, బిర్యానీ ఆకు వేసి నానబెట్టండి. తర్వాత చికెన్ బ్రెస్ట్, బంగాళాదుంపలు ,టమోటాలను ముక్కలుగా కోయండి.

3. మందపాటి పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దానిపై నూనె రాసి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు వేసి, టమోటాలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.

4. ఇప్పుడు చికెన్, బంగాళాదుంపలు, పెరుగు, బిర్యానీ మసాలా, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు వేసి బాగా కలిపి కనీసం 15 నిమిషాలు వేయించాలి. ఇలా చేయడం వలన పదార్థాలు పూర్తిగా కలిసిపోతాయి.

5. ఇప్పుడు మరిగించిన బియ్యం మీద బిర్యానీ మసాలా చల్లి వేడి నీరు పోసి బియ్యం 80 శాతం ఉడికిన తర్వాత దింపేయ్యండి.

6. ఇప్పుడు పాన్ లో చికెన్ టొమాటో మసాలా మిశ్రమం వేసి పచ్చి మిరపకాయలు, వేయించిన ఉల్లిపాయల ముక్కలు చల్లి.. పైన ఉడికించిన అన్నం వేయండి.

7. ఆపై ఈ మిశ్రమంపై బిర్యానీ మసాలా, ఫుడ్ కలర్, వెన్న మిశ్రమాన్ని వేసి దానిమీద బటర్ పేపర్ వేసి కవర్ చేయండి. దాదాపు 15 నిమిషాలు ఉడికించండి. అంతే సింపుల్ గా చికెన్ బిర్యానీ రెడీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా యూజర్స్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ముఖ్యంగా బిర్యానీ లవర్స్ ని తెగ ఆకట్ట్టుకుంటుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..