సరీసృపాలు ఈ మధ్యకాలంలో తమ ఆవాసాలను విడిచిపెట్టి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు మీరు చూస్తూనే ఉంటారు. బెడ్‌రూమ్, వంటగది, ఫ్రిడ్జ్, ఏసీ.. షూస్.. ఇలా ఒకటేమిటి.. ప్రతీ చోటా స్నేక్స్ దర్శనమిచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో చంద్ర విహార్ ప్రాంతంలోని SDM స్కూల్ సమీపంలో ఉన్న పొదల్లో భారీ కొండచిలువ ఒకటి కనిపించింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చుట్టుప్రక్కల వారు భయబ్రాంతులకు గురి కావడంతో.. స్థానిక అధికారులు వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బందికి అందించారు. వారు ఘటనస్థలికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహని జరగకపోవడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఢిల్లీ లాంటి ప్రధాన పట్టణాల్లోనూ ఇలాంటి వన్యప్రాణాలు దర్శనమివ్వడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, నివాసితులు, వన్యప్రాణుల భద్రతను సంరక్షించేందుకు స్థానిక అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా
राजधानी दिल्ली के चंद्र विहार इलाके के SDM स्कूल के पास दिखा खतरनाक अजगर, अजगर को देखने के लिए लोगों की खूब जमा हुई भीड़, क्या अब दिल्ली भी जंगल बनता जा रहा है? pic.twitter.com/lK2dsqGGyE
— Gagandeep Singh (@GagandeepNews) September 10, 2024
ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి