Viral Video: కొండచిలువకు ఎదురెళ్లిన పులి.. చివరికి గెలిచింది ఎవరంటే.. వైరల్ వీడియో!

Viral Video: జంతువు పెద్దదైనా, చిన్నదైనా కొండచిలువకు భయపడాల్సిందే. సరీసృపాలలో అత్యంత భయంకరమైనది కొండచిలువ. ఏ జంతువైనా..

Viral Video: కొండచిలువకు ఎదురెళ్లిన పులి.. చివరికి గెలిచింది ఎవరంటే.. వైరల్ వీడియో!
Python And Tiger

Updated on: Sep 05, 2021 | 12:13 PM

జంతువు పెద్దదైనా, చిన్నదైనా కొండచిలువకు భయపడాల్సిందే. సరీసృపాలలో అత్యంత భయంకరమైనది కొండచిలువ. ఏ జంతువైనా కొండచిలువకు చిక్కినట్లయితే.. అది బ్రతకడం కష్టమని చెప్పాలి. మరి అంతటి బలశాలికి పులి లాంటి సమవుజ్జీ ఎదురెళ్లితే.. పోరాటం బీభత్సం అని చెప్పొచ్చు. యెవరు గెలుస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వైరల్ వీడియో ఒకటి తెగ హల్చల్ చేస్తోంది. ఓ భారీ కొండచిలువ.. పులి వెళ్తున్న మార్గంలో అడ్డొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరూ చూసేయండి.

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో అలాంటి కంటెంట్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పులి ఓ మార్గం గుండా వెళ్తుండగా.. అకస్మాత్తుగా భారీ కొండచిలువ దాని దారికి అడ్డొచ్చింది.

ఒకేసారి ఇద్దరు బలశాలులు ముఖాముఖిగా వచ్చినప్పుడు.. ఒకరికొకరు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. కొండచిలువను చూసి పులి భయపడుతుంది. కొంత సమయం వేచి చూసి కొండచిలువతో పోటీకి దిగకుండా పులి పక్క నుంచి వెళ్లిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ‘పెటేషన్ 365’ అనే పేజ్ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:  Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఈ 5 బైకులపై ఓ లుక్కేయండి.!