Viral Video: చీర బంగారు నగలతో జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న యువతి.. రీజన్ తెలిస్తే షాక్

|

Aug 29, 2022 | 10:49 AM

ప్రజలు వివిధ రకాల బట్టలు ధరించి జిమ్ చేస్తూ కనిపిస్తారు. కానీ ఒక మహిళ చీర ధరించి జిమ్ చేస్తే వినడానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ  వైరల్ వీడియోలో మీరు అలాంటిదే చూడవచ్చు. 

Viral Video: చీర బంగారు నగలతో జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న యువతి.. రీజన్ తెలిస్తే షాక్
Viral Video
Follow us on

Viral Video: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫిట్‌నెస్‌ తప్పనిసరి. దీంతో తమ ఫిటినెస్ పై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది అవసరం కూడా..  ఎందుకంటే ఫిట్‌గా ఉండటానికి సమతుల్య ఆహారంతో పాటు, రెగ్యులర్ వర్కౌట్‌లు కూడా చాలా ముఖ్యమైనవి. పురుషులే కాదు ఈ రోజుల్లో మహిళలు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మహిళలు రోజూ జిమ్‌కి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. జిమ్‌లో చెమటలు పట్టే విధంగా వర్కౌట్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది, అయితే ఇది అన్ని వీడియోలకంటే భిన్నంగా ఉంది. ఈ వీడియోలో ఫిట్‌నెస్‌ కోసం వర్కౌట్స్ చేస్తోన్న యువతికి చీర, నగలు ధరించి ఉంది.

ప్రజలు వివిధ రకాల బట్టలు ధరించి జిమ్ చేస్తూ కనిపిస్తారు. కానీ ఒక మహిళ చీర ధరించి జిమ్ చేస్తే వినడానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ  వైరల్ వీడియోలో మీరు అలాంటిదే చూడవచ్చు.  ఓ యువతి పెళ్లికూతురు అలంకారంలో పట్టుచీర.. ఆభరణాలను ధరించి ఉంది. జిమ్‌లో డంబెల్స్ ఎత్తుతూ వ్యాయామం చేస్తోంది. ఆమె చాలా వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

జిమ్‌లో పెళ్లికూతురు ఎలా చెమటోడుస్తుందో చూడండి

ఆ మహిళ చీర, నగలు ధరించి జిమ్‌కి రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారు.. ఈ వీడియో ఆ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగమని తెలుస్తోంది. ప్రస్తుతం డిఫరెంట్ పద్ధతిలో  ప్రీ వెడ్డింగ్ షూట్‌ అంటూ పెళ్లికి ముందు వధూవరులు ఫోటోషూట్‌లు చేస్తారు. అందులో భాగస్వాములతో  అందమైన క్షణాలు కెమెరాలో బంధించబడతాయి.

వధువుకి సంబంధించిన ప్రత్యేకమైన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను పూనమ్ దత్తా అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఒకటైన ట్విట్టర్‌లో షేర్ చేసింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 48 వేలకు పైగా వీక్షించగా వందలాది మంది లైక్వి చేస్తున్నారు. విధ రియాక్షన్‌లు కూడా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..