డాడీ వెళ్ళద్దు.. చిన్నారి మారాం.!
పోలీస్ డ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా.. సమయం గురించి పట్టించుకోకుండా అక్కడికి క్షణాల్లోనే చేరుకుంటారు. వారు అసలు కుటుంబసభ్యులకు సమయం కేటాయించడమే తక్కువ. అలాంటిది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సంగతి వేరే చెప్పాలా.. మాములుగానే తల్లిదండ్రులు బయటికి వెళుతుంటే నేనూ వస్తానని మారాం చేస్తుంటారు. ఇక సరిగ్గా […]
పోలీస్ డ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా.. సమయం గురించి పట్టించుకోకుండా అక్కడికి క్షణాల్లోనే చేరుకుంటారు. వారు అసలు కుటుంబసభ్యులకు సమయం కేటాయించడమే తక్కువ. అలాంటిది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సంగతి వేరే చెప్పాలా.. మాములుగానే తల్లిదండ్రులు బయటికి వెళుతుంటే నేనూ వస్తానని మారాం చేస్తుంటారు. ఇక సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భువనేశ్వర్‌కు చెందిన ఓ పోలీసు ఆఫీసర్ డ్యూటీకి వెళ్లడానికి యూనిఫాం వేసుకొని రెడీ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో దాదాపు నాలుగేళ్ళ ఆయన కొడుకు ఏడుస్తూ ‘నన్ను వదిలి వెళ్ళద్దు నాన్నా’ అంటూ కాళ్లను పట్టుకుని విడవలేదు. ఆయన ఎంతగా సముదాయించాలని చూసినా.. ఆ పిల్లాడు కాళ్లనే పట్టుకుని వేలాడాడు. మారాం చేసే పిల్లలంటే ఇలాగే ఉంటారు మరి.!
This is the toughest part of the police job. Due to long and erratic duty hours most of the police officers have to face this situation.
Do watch. pic.twitter.com/aDOVpVZ879
— Arun Bothra (@arunbothra) April 28, 2019