ఇదొక అద్భుతం..! కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం.. చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు

|

Jun 23, 2024 | 6:10 PM

సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్ట్‌పై తమ స్పందనలను ఇస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు... పింక్ కలర్ డాల్ఫిన్ చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరొక వినియోగదారు రాశారు..ఇది కేవలం అద్భుతమైన ఎడిటింగ్ అంటున్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు... పింక్ డాల్ఫిన్ నిజంగా ఉనికిలో ఉంటే అది చాలా షాకింగ్ విషయం అని పేర్కొన్నారు.

ఇదొక అద్భుతం..! కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం.. చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు
Pink Dolphins
Follow us on

ప్రపంచంలో మనుషుల తర్వాత అత్యంత తెలివైన జీవిగా డాల్ఫిన్ పరిగణించబడుతుంది. డాల్ఫిన్ ఎంత తెలివైనదో అంతే అరుదు. అంటే డాల్ఫిన్‌ను చూడటం అనేది ప్రజలకు ఉత్సుకత కలిగించే క్షణం. అటువంటి పరిస్థితిలో అరుదైన డాల్ఫిన్ మీకు కనిపిస్తే ఎలా ఉంటుంది..అప్పుడు మీరు ఏం చేస్తారు? సహజంగానే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటిదే ఈ వీడియో. ఇక్కడ పింక్ డాల్ఫిన్ కనిపించే ఒక చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ పింక్ డాల్ఫిన్ ఉత్తర కరోలినా తీరానికి సమీపంలో కనిపించిందని సమాచారం. అమెరికాలోని కరోలినా తీరంలో పింక్ డాల్ఫిన్ కనిపించింది. పింక్ డాల్ఫిన్ చాలా అరుదుగా కనిపించే జీవులలో ఒకటి.

పింక్ డాల్ఫిన్ అమెరికాలోని కరోలినా తీరంలో కనిపించింది. పింక్ డాల్ఫిన్ చాలా అరుదుగా కనిపించే జీవులలో ఒకటి. అలాంటి అరుదైన, అందమైన డాల్ఫిన్‌ కెమెరాలో బంధించడం జంతు ప్రేమికులకు ఆహ్లాదకరమైన అనుభూతి. డాల్ఫిన్ ఈ చిత్రం జూన్ 18న @1800factsmatter అనే X ఖాతాతో షేర్‌ చేయబడింది. దాంతో పాటు వినియోగదారు ఇలా వ్రాశారు…”నార్త్ కరోలినా తీరంలో అరుదైన పింక్ డాల్ఫిన్ కనిపించింది”. ఫోటోలు షేర్‌ చేయటంతో పింక్ డాల్ఫిన్ ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు కూడా, కాలిఫోర్నియాలో తిమింగలం చూడటానికి వెళ్ళిన ఒక బృందం అద్భుతమైన తెల్ల డాల్ఫిన్‌ను చూసింది. తిమింగలం చూసేందుకు వెళ్లిన వారి పడవతో పాటు కాస్పర్ అనే ఈ తెల్ల డాల్ఫిన్ ఈదుకుంటూ వారిని మరింత ఆహ్లాదపరిచింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను @1800factsmatter అనే వినియోగదారు షేర్ చేసారు. దీన్ని ఇప్పటివరకు వేలాది మంది చూశారు. చాలా మంది పోస్ట్‌ను లైక్ చేసారు. అటువంటి పరిస్థితిలో, సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్ట్‌పై తమ స్పందనలను ఇస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు… పింక్ కలర్ డాల్ఫిన్ చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరొక వినియోగదారు రాశారు..ఇది కేవలం అద్భుతమైన ఎడిటింగ్ అంటున్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు… పింక్ డాల్ఫిన్ నిజంగా ఉనికిలో ఉంటే అది చాలా షాకింగ్ విషయం అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..