Green Chilli Halwa: పిచ్చెక్కిందా ఏంటీ..? పచ్చి మిర్చి హల్వా అంట.. వామ్మో అంటున్న నెటిజన్లు..

Green Chilli Halwa: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో పలు ఆహార పదార్థాలకు సంబంధించిన

Green Chilli Halwa: పిచ్చెక్కిందా ఏంటీ..? పచ్చి మిర్చి హల్వా అంట.. వామ్మో అంటున్న నెటిజన్లు..
Green Chilli

Updated on: Jan 29, 2022 | 8:10 PM

Green Chilli Halwa: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో పలు ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు, వినూత్న వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి విచిత్ర వంటకాల వీడియోలను చూసి ఆహార ప్రియులే నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, పుచ్చకాయ మిల్క్ షేక్.. వెజ్ ఫిష్ ఫ్రై ఇలా ఒక్కటేమిటీ ఎన్నో రకాలు వంటకాలు (Dish) నెట్టింట్లో వైరల్ (Viral) అయిన సంగతి తెలిసిందే. తాజాగా పచ్చి మిర్చి హల్వా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఇదేంటి నాయనా.. తినడానికేనా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

వాస్తవానికి పచ్చి మిరపకాయలను అన్ని ఆహార వంటకాలలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొంతమంది వారి వారి స్టైల్లో చట్నీలు చేసుకోని ఇష్టపడుతూ తింటారు. ఇంకొంత మంది మాత్రం పచ్చి మిరపకాయలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. అలాంటి పచ్చి మిర్చితో ఒకరు చేసిన వంటకం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వింత వంటకం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పచ్చి మిరపకాయలతో హల్వా చేసిన ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

వైరల్ ఫొటో..

Also Read:

Watch Video: పడవ నిండా జనం.. క్షణంలో ఒడ్డుకు చేరుతారనగా బోల్తా.. షాకింగ్ వీడియో

Wedding: గూండాల బెదిరింపులు.. 100 మంది పోలీసుల ప‌హారాలో ద‌ళితుడి పెళ్లి ఊరేగింపు.. అసలేమైందంటే..?