
Viral Video: దొంగతనానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే దొంగతనం మీరెప్పుడైనా చూశారా? దీనికి సంబంధించిన వీడియోను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక యువకుడు దుకాణానికి వచ్చి అక్కడ కూర్చున్న ఉద్యోగిని మోసం చేసి ఫోన్ దొంగిలించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం సంఘటన దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఎక్కడిది, ఎప్పుడు జరిగింది అనే దాని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ వీడు మాత్రం తెలివిగా దొంగతనం చేశాడు. ఈ వీడియోలో ఆ యువకుడు మొదట దుకాణానికి వచ్చి మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉందని చూసి దాని ఛార్జింగ్ కేబుల్‌ను తీసివేస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఉద్యోగి ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. తర్వాత మళ్లీ ఆ యువకుడు అటుగా వెళ్తూ ఫోన్‌ను దొంగిలిస్తాడు.
How smoothly he stole his Phone😭 pic.twitter.com/ejt04zh3Lb
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 18, 2025
ఇది కూడా చదవండి: Kai Trump: ట్రంప్ మనవరాలు గురించి మీకు తెలుసా? ఆయన కంటే ధనవంతురాలు.. ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాకవుతారు!
దొంగ ఫోన్‌ను జేబులో పెట్టుకుని దుకాణం నుండి బయటకు ఎలా వెళ్లాడో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దొంగతను చూసిన వారు ఏం తెలివిరా నాయానా..! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే
ఇది కూడా చదవండి: Viral Video: ఇంట్లో వింత శబ్దాలు.. ఫ్రిజ్ వెనుకాల చూడగానే ముచ్చెమటలు పట్టేశాయ్.. వీడియో వైరల్
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి