ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వంట రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ వీటిని కట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ఉల్లిపాయలను కట్ చేసే సమయంలో కళ్ల వెంట పెద్ద జలపాతమే పారుతుంది. ఉల్లికి ఉండే ఘాటు వలన కళ్లు మంటగా ఉండడం.. కన్నీళ్లు రావడం జరుగుతుంది. కానీ కొందరు మాత్రం ఉల్లిపాయలను ఎంతో వేగంగా.. అందంగా కట్ చేస్తుంటారు. రెస్టారెంట్స్.. హోటల్స్ లలో ఉల్లిపాయలను ఎంతో వేగంగా కట్ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఉల్లిపాయలను వేగంగా కట్ చేసే వీడియోలను చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉల్లిపాయ కట్టింగ్ వీడియో మాత్రం నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. అసలు విషయం తెలుసుకుందామా..
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి సగం ఉల్లిపాయను తీసుకుని వేగంగా.. సన్నగా కట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత దానిని మరోవైపు తిప్పి ఎంతో అందంగా.. వేగంగా కట్ చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉల్లిపాయ కట్టింగ్ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..
Also Read: Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..
Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..
Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..
Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..