వామ్మో.. వాడి పళ్లు చూస్తే.. బైర్లు కమ్మే కళ్లు

సాధారణంగా మనుషులకు 32 పళ్లుంటాయి. చాలా తక్కువ మందికి (పన్ను మీద పన్ను ఉన్నవారికి)మరో రెండు అదనంగా ఉంటాయి. అలాంటిది ఒక ఏడేళ్ల బాలుడికి 526 పళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నంటిని ఇటీవల తొలగించారు చైన్నైకు చెందిన సవిత దంత వైద్య కళాశాల డాక్టర్లు. అవన్నీ కూడా ఒక్కచోటే(కింది దవడ కుడిభాగం) ఉండటం గమనర్హం. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు సర్జన్లు, ఏడుగురు పాథాలజిస్టులు పాల్గొనగా.. దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. కాంపౌండ్ కంపోజిట్ ఒండోన్టొమో […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:10 pm, Thu, 1 August 19
వామ్మో.. వాడి పళ్లు చూస్తే.. బైర్లు కమ్మే కళ్లు

సాధారణంగా మనుషులకు 32 పళ్లుంటాయి. చాలా తక్కువ మందికి (పన్ను మీద పన్ను ఉన్నవారికి)మరో రెండు అదనంగా ఉంటాయి. అలాంటిది ఒక ఏడేళ్ల బాలుడికి 526 పళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నంటిని ఇటీవల తొలగించారు చైన్నైకు చెందిన సవిత దంత వైద్య కళాశాల డాక్టర్లు. అవన్నీ కూడా ఒక్కచోటే(కింది దవడ కుడిభాగం) ఉండటం గమనర్హం. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు సర్జన్లు, ఏడుగురు పాథాలజిస్టులు పాల్గొనగా.. దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. కాంపౌండ్ కంపోజిట్ ఒండోన్టొమో అనే రేర్ డిసీజ్ అతడికి ఉండటం వల్లే ఇలా పళ్లు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే ఆ బాబు మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడే నోటీలో బాగా వాపు వచ్చిందని, అప్పుడే సమస్యను గుర్తించినా, సహకరించకపోవడంతోనే శస్త్రచికిత్స చేయలేకపోయారని వైద్యులు వెల్లడించారు. ఇక ఇప్పుడు తొలగించిన పళ్లు దాదాపు 200గ్రాములు తూగాయని, అందులో చిన్న, పెద్ద, మధ్య సైజుల్లో పళ్లు ఉన్నాయని డాక్టర్ సెంథిల్ నాథన్ తెలిపారు. ఒక్కచోటే ఇన్ని దంతాలను గుర్తించి, తొలగించడం ప్రపంచంలో ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. కాగా గతంలో ముంబయిలో ఓ యుక్తవయసు బాలుడి నోటి నుంచి 232 దంతాలను తొలగించారని వెల్లడించారు.