Viral Video: పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్లు.. మయూరాల సొగసులకు నెటిజన్లు ఫిదా
సృష్టిలోని అందమైన పక్షుల్లో నెమలి (Peacock) ఒకటి. నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అది పురివిప్పితే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే...
సృష్టిలోని అందమైన పక్షుల్లో నెమలి (Peacock) ఒకటి. నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక అది పురివిప్పితే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అయితే ఒకేసారి రెండు నెమళ్లు నాట్యం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతంది. అలాంటి ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఢిల్లీలోని ఓ భవనం బాల్కనీపై కొన్ని నెమళ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఇంతలో ఓ మగ నెమలి, పురి విప్పింది. వెంటనే పక్కనున్న తెల్ల నెమలి కూడా ఫించం విప్పింది. తెల్ల నెమలి పురి విప్పినప్పుడు, ఫించాల్లో కొన్ని గ్రీన్ కలర్ ఉండగా మధ్యలోనివి తెలుపు రంగులో ఉన్నాయి. సాధారణంగా తెల్ల నెమలి ఫించాలన్నీ తెల్లగానే ఉంటాయి. కానీ ఈ నెమలికి మాత్రం రెండు రంగుల్లో ఉండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియో నెటిజన్ల మనసుదోచుకుంటుంది. కోట్లమంది నెటిజన్లు వీక్షిస్తున్నారు. లక్షల్లో లైక్ చేస్తున్నారు. మల్టీకలర్ నెమలి అద్భుతంగా ఉందంటున్నారు. వీడియోను చూసి తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..