Viral Video:: గుడ్లు దొగలించాలనుకుంది.. ఊహించని షాక్ తింది.. అమ్మాయికి చుక్కలు చూపించిన నెమలి

|

Jun 02, 2022 | 8:17 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయం కలిగించేవి అయితే మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి.

Viral Video:: గుడ్లు దొగలించాలనుకుంది.. ఊహించని షాక్ తింది.. అమ్మాయికి చుక్కలు చూపించిన నెమలి
Viral Video
Follow us on

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయం కలిగించేవి అయితే మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ఇక మనిషైనా జంతువైనా.. పక్షులైనా తమ పిల్లలజోలికి ఎవరైనా వస్తే ఉరుకుంటాయా..? ప్రాణానికి తెగించి పోరాడుతాయి. కొంతమంది ఆకతాయిలు కావాలనే జంతువుల పిల్లలను, పక్షుల గుడ్లను దోగిలించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంతో అవి వారి పై దాడి చేస్తూ ఉంటాయి.  దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

నెమలి గుడ్డు దొంగిలించడానికి ఓ అమ్మాయి ఏం చేసిందో, ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడవచ్చు. ఏంజరిగిందంటే నెమలి గుడ్డును దొంగిలించడానికి ఓ అమ్మాయి ప్రయత్నించింది. దాంతో ఆ అమ్మాయికి నెమలి చుక్కలు చూపించింది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నెమలి తన గుడ్లను పొదుగుతున్న సమాయంలో ఒక అమ్మాయి అక్కడకు వచ్చింది.  అక్కడికి చేరుకుని నెమ్మదిగా వెనుక నుంచి వచ్చి నెమలిని ఎత్తుకుని పక్కకు విసిరింది. ఆ తర్వాత గుడ్లు దొంగిలించడం మొదలుపెట్టింది. నెమలి గుడ్లు సేకరిస్తున్న సమయంలో వెంటనే నెమలి  ఆమె పై ఒక్కసారిగా దాడి చేసింది. ఆ అమ్మాయిని ఒక్కసారిగా తలపై దాని కాళ్లతో తన్నింది. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి