దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోల కంటే ఢిల్లీ మెట్రో రైల్ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. తరచూ ఏదో ఒక ఊహించని సంఘటనతో ఢిల్లీ మెట్రో ఎప్పుడు వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఈసారి దసరా సంబరాలకు వేదికగా మారింది ఢిల్లీ మెట్రో రైల్. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చేసిన హంగామా అందరినీ ఆకర్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొంతమంది నవరాత్రి సంబరాలు చేపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మెట్రోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడుతుండగా, మరికొందరు కోరస్ పాడుతున్నారు. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు.
ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ముచ్చట పడుతుండగా, మరికొందరు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి పనులు ఏంటి అని మండిపడుతున్నారు.