
స్పెయిన్‌లోని మాడ్రిడ్ బరాజాస్ విమానాశ్రయం నుండి వెనిజులా రాజధాని కారకాస్‌కు వెళ్తున్న ట్రాన్స్‌అట్లాంటిక్ ప్లస్ అల్ట్రా విమానంలో ఈ సంఘటన జరిగిందని డైలీ మెయిల్ నివేదించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, విమానంలో అత్యవసర ద్వారం దగ్గర కూర్చున్న ఒక యువకుడు అకస్మాత్తుగా పైకి దూకి అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించాడు. అతను డోర్ లివర్ లాగడానికి ప్రయత్నించడం చూసి, ఇతర ప్రయాణీకులు అలారం మోగించారు, ఆపై విమాన సిబ్బంది వచ్చి అతన్ని అరెస్టు చేశారు.
విమానం 35,000 అడుగుల ఎత్తులో ఉంది.. అట్లాంటిక్ మహా సముద్రం దాటుతోంది..ఇంతలోనే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు..ఈ సంఘటన తర్వాత అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఫిబ్రవరి 28న మాడ్రిడ్‌లోని బరాజాస్ విమానాశ్రయం నుండి వెనిజులా రాజధాని కారకాస్‌కు బయలుదేరిన ప్లస్ అల్ట్రా ఫ్లైట్ 701లో ఈ సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో అత్యవసర ద్వారం దగ్గర కూర్చున్న ఒక యువకుడు అకస్మాత్తుగా పైకి దూకి ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అతను డోర్ లివర్ లాగడానికి ప్రయత్నించడం చూసి, ఇతర ప్రయాణీకులు అలారం మోగించారు. ఆపై విమాన సిబ్బంది వచ్చి అతన్ని అరెస్టు చేశారు.
భయాందోళనకు గురైన ప్రయాణీకులు తమ సీట్లలోంచి లేచి విమానం తలుపు వైపు చూడటంతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రజలు తమ సీట్ల నుండి లేచి నిలబడి కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.. ఇంతలో, ముగ్గురు, నలుగురు వ్యక్తులు, క్యాబిన్ సిబ్బంది అతన్ని పట్టుకుని దూరంగా లాగేశారు.. ఆ ప్రయాణికుడి చేతులు వెనక్కి కట్టి నేలపై పడవేసినట్టుగా వీడియో చూస్తుంటే తెలుస్తోంది. విమానం కిందకు దిగేంత వరకు అతనిపై కఠినమైన నిఘా ఉంచారు. ఈ మొత్తం సంఘటనలో ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించిన విమాన సహాయకురాలు గాయపడింది.
వీడియో ఇక్కడ చూడండి..
#Internacionales | Durante el vuelo 701 de la aerolínea Plus Ultra, que cubría la ruta Madrid-Caracas el pasado 1 de marzo, se registró un incidente que puso en riesgo la seguridad de los pasajeros y la tripulación. #3Mar – Edixon Manuel pic.twitter.com/ymkzM2E9xj
— LLanero Digital (@LlaneroDigitalV) March 3, 2025
@LlaneroDigitalV అనే వినియోగదారు X లో ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియోను పోస్ట్ చేస్తూ ఇలా వ్రాశారు. మార్చి 1న మాడ్రిడ్-కారకాస్ మార్గంలో ఎగురుతున్న ప్లస్ అల్ట్రా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 701 విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది సభ్యుల భద్రతకు ముప్పు కలిగించే ఒక సంఘటన జరిగింది అని రాశారు. ఇక వీడియో వేగంగా వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై పెద్ద సంఖ్యలో స్పందించారు. చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..