
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వస్తుంది. ఇది జనాల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారులను పిచ్చివాళ్లను చేస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పార్లే జితో ఓ వింత ప్రయోగం చేస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీరు దీన్నిపై ఖచ్చితంగా స్పందిస్తారు. ఇది మీకు చెత్తగా అనిపించినా, ఈ ప్రయోగం చూడటానికి మాత్రం చాలా వింతగా కనిపిస్తుంది. మరికెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లిపోదాం…
ఈ వీడియోలో ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి తయారు చేసిన వెరైటీ ఆమ్లెట్‌ని చూస్తారు. అతడు వింతగా పార్లే జి బిస్కెట్లతో ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఇందుకోసం అతడు ముందుగా ఒక పాన్‌లో బట్టర్ వేసి బాగా కరిగించాడు. ఆ తరువాత, అతను రెండు-మూడు గుడ్లు పగలగొట్టి అందులో ఉప్పుకారం అన్ని వేసి బాగా బీట్ చేసి ఆ పాన్‌లో పోస్తాడు. అది ఉడుకుతుండగానే అతడు మరిన్ని మసాలాలు కూడా యాడ్ చేశాడు. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా మొదలైనవి అన్ని దానిపై చల్లుతున్నాడు.
వీటిన్నింటి కంటే ముందుగా అతడు ఆమ్లెట్ వేయటం ప్రారంభించగానే, అతను బ్రెడ్ కు బదులుగా దానిపై పార్లే జి బిస్కెట్లు అమర్చాడు. ఆ తరువాత మనం పైన చెప్పుకున్న మసాలాలన్నీ ఆమ్లెట్ మీద అలంకరిస్తాడు. ఆఖరున గుడకబెట్టిన గుడ్డును తురిమి వేశాడు. దానికి రెండు రకాలైన చట్నీలాంటిది కూడా పెట్టి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు.. అతడు చేసిన ఈ స్పెషల్ వెరైటీ ఆమ్లెట్‌ని ఒక్కసారి రుచి చూస్తే మర్చిపోలేరు అంటూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా తను చేసిన ఈ స్పెషల్ ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్‌లో కూడా చెప్పమంటున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ ఆశ్చర్యకరమైన వీడియోను mr_shahzad_ajmer అనే ఖాతా నుండి Instagram లో షేర్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ ప్రయోగంపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..