Viral Video: లైవ్‌లోనే బాలుడి చెంప చెల్లుమనిపించిన రిపోర్టర్.. అతను చేసిన పనికి చిర్రెత్తుకొచ్చి.. వీడియో

పాకిస్తాన్‌లో ఈద్ ఉల్-అదా వేడుకలపై రిపోర్టింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన నెట్టింట, ట్విట్టర్‌లో కలకలం రేపింది. నెటిజన్లు కొంతమంది జర్నలిస్టుకు మద్దతుగా ట్వీట్ చేశారు.

Viral Video: లైవ్‌లోనే బాలుడి చెంప చెల్లుమనిపించిన రిపోర్టర్.. అతను చేసిన పనికి చిర్రెత్తుకొచ్చి.. వీడియో
Pakistani Reporter Slaps Bo

Updated on: Jul 12, 2022 | 5:52 PM

Pakistani reporter slaps boy: పాకిస్థాన్ లో ఓ టీవి ఛానల్ రిపోర్టర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రిపోర్టర్ తనను డిస్టర్బ్‌ చేస్తున్నాడన్న నేపంతో ఓ బాలుడిని చెంపదెబ్బ కొట్టింది. ట్విటర్‌లో ఈ వీడియోను 3.8 లక్షల మందికి పైగా చూశారు. వీడియోలో సదరు రిపోర్టర్‌ పాకిస్తాన్‌లో ఈద్ ఉల్-అదా వేడుకలపై రిపోర్టింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన నెట్టింట, ట్విట్టర్‌లో కలకలం రేపింది. నెటిజన్లు కొంతమంది జర్నలిస్టుకు మద్దతుగా ట్వీట్ చేశారు. “బాలుడు తప్పుగా ప్రవర్తించి ఉంటాడు” అంటూ ఆమె చర్యను సమర్థించారు. “అతను ఆ చెంపదెబ్బకు పూర్తిగా అర్హుడు, ఆమె సరిగ్గానే చేసింది” అని ఇంకొందరు ట్వీట్ చేశారు. ఆమె హెచ్చరించినా ఆ అబ్బాయి ఆమెను పదే పదే డిస్టర్బ్ చేశాడని మరొకరు ట్వీట్ చేశారు. కొందరు రిపోర్టర్ చర్యను.. తప్పుపట్టారు.”హింస సమాధానం కాదు” అంటూ ట్వీట్ చేశారు.

బక్రీద్ వేడుకల సందర్భంగా.. జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తుండగా ఆమె దగ్గర మహిళలు, పిల్లలు నిల్చొని ఉన్నారు. అయితే ఆమె రిపోర్టింగ్ ముగిసిన వెంటనే.. రిపోర్టర్ పక్కన నిలబడి ఉన్న తెల్ల చొక్కా ధరించిన యువకుడిని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాన్ని చూడవచ్చు. డిస్టర్బ్ చేయడంతో రిపోర్టర్‌కి చిర్రెత్తుకొచ్చిందని.. దీంతో ఆమె బాలుడిని కొట్టినట్లు పేర్కొంటున్నారు. బాలుడు పదే పదే డిస్టర్బ్ చేస్తుండగా.. రెండు మూడు సార్లు ఆమె హెచ్చరించిందని.. అయినప్పటికీ వినకపోవడంతో ఆమె కొట్టినట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటన పాకిస్తాన్‌లో కలకలం రేపింది. దీంతోపాటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి