Operation Sindoor: అయ్యో పాపం అమాయకులంటూ.. లైవ్‌లోనే ఏడ్చేసిన యాంకర్‌.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రమూకను మట్టుపెట్టింది. భారత ఆర్మీ విసిరిన పంజాకు దాదాపు 100మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. నేపథ్యంలోనే ఓ పాకిస్తానీ న్యూస్ యాంకర్ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవుడా నువ్వే కాపాడు.. అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ కావడంతో నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Operation Sindoor: అయ్యో పాపం అమాయకులంటూ.. లైవ్‌లోనే ఏడ్చేసిన యాంకర్‌.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..
Pakistan Tv Anchor Cries

Updated on: May 08, 2025 | 8:07 AM

ఒక పాకిస్తానీ టీవీ యాంకర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వారికి ఆమె సంతాపం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదనకు గురైంది. లైవ్‌లోనే ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏడుస్తూనే అమాయక ప్రజల ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ ఆ భగవంతున్ని ఇలా ప్రార్ధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె వేదన ఏంటంటే..

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టిగానే సమాధానం ఇచ్చింది. భారత్‌ దెబ్బకు మొత్తం పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రమూకను మట్టుపెట్టింది. భారత ఆర్మీ విసిరిన పంజాకు దాదాపు 100మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. నేపథ్యంలోనే ఓ పాకిస్తానీ న్యూస్ యాంకర్ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్‌ సింధూరం దాడిలో మరణించిన పాకిస్తానీ ప్రజల పట్ల ఆమె విచారం వ్యక్తం చేసింది. టీ షో లైవ్‌లో ఉండగానే ఆ యాంకర్‌ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా వేడుకుంది. అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ కావడంతో నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వైరల్ వీడియో @Incognito_qfs అనే X పేజీ నుండి షేర్ చేయబడింది. దీనికి ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లతో స్పందించారు. ఉగ్రవాదులు చనిపోతే ఏడుస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు దీనిపై స్పందిస్తూ..ఈమె యాంకర్‌గా కాదు.. పాకిస్తానీ సీరియల్స్‌లో నటించాలని సూచించారు. ఇంకొకరు స్పందిస్తూ.. ఆపు అక్క.. ఎంత డ్రామా చేస్తున్నావు.. అంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..