Viral News: పాములు ఇంట్లోకి వస్తున్నాయని.. పొగ బెట్టాడు.. చివరకు ఏమైందంటే..?

|

Dec 04, 2021 | 6:40 PM

Fighting snake infestation: ఎక్కడైనా సరే.. పాములు ఇంటిలోపలికి వస్తే.. వాటిని తరిమేయడానికి ప్రయత్నిస్తారు.. లేకపోతే.. పాములు పట్టే వ్యక్తిని పిలిచి సమస్య నుంచి గట్టెక్కుతారు. కానీ ఓ వ్యక్తి

Viral News: పాములు ఇంట్లోకి వస్తున్నాయని.. పొగ బెట్టాడు.. చివరకు ఏమైందంటే..?
House
Follow us on

Fighting snake infestation: ఎక్కడైనా సరే.. పాములు ఇంటిలోపలికి వస్తే.. వాటిని తరిమేయడానికి ప్రయత్నిస్తారు.. లేకపోతే.. పాములు పట్టే వ్యక్తిని పిలిచి సమస్య నుంచి గట్టెక్కుతారు. కానీ ఓ వ్యక్తి పాములను తరిమేయడానికి తీసుకున్న నిర్ణయం ఇంటిల్లిపాదిని నడిరోడ్డుపై నిలబెట్టింది. అమెరికాలోని ఒక ఇంటి యజమాని పాములతో పోరాడతూ.. ఇంటిని తగలబెట్టాడు. పాములను వదిలించుకోవాలన్న అతని ప్రయత్నంలో మంటలు చెలరేగడంతో కోట్లాది రూపాయల ఇల్లు కాలిబూడిదైంది. ఈ సంఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమెరీ కౌంటీలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. ఇల్లంతా కాలిబూడిదైనట్లు అధికారులు తెలిపారు.

యజమాని పొగతో ఇంటి నుంచి పాములను బయటకు పంపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మండుతున్న బొగ్గులు.. ఇంటిలోని వస్తువులకు తగిలి ఇల్లంతా కాలిపోయిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు చెలరేగాన్ని చూసిన యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసారు. వారు వచ్చే లోపే ఇల్లంతా కాలినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ కాలిపోయిన ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మొత్తం 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.

ట్విట్.. 


అగ్నిమాపక శాఖ ప్రతినిధి పీట్ పిరింగర్ ట్వీట్ చేస్తూ.. పాముల బెడద నుంచి బయటపడేందుకు చాలామంది పొగను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో మండుతున్న బొగ్గులు అంటుకొని ఇల్లు మొత్తం కాలినట్లు ట్విట్ చేశారు. ఈ ప్రాంతంలో పాముల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన తెలిపారు.

Also Read:

Viral Video: కారును ఢీకొట్టాడని.. ఎస్‌ఐనే కొట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో వైరల్‌

Vijayawada: డబ్బు కోసం చైల్డ్‌ పోర్న్‌ వీడియోల బిజినెస్ మొదలు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. యువ ఇంజినీర్‌ అరెస్ట్‌