మీరు ఇన్‌స్టా, ట్విట్టర్,ఫేస్ బుక్(faceboook), స్నాప్ చాట్ యూజ్ చేస్తున్నారా..?. అయితే ఈ మధ్య కాలంలో ఫోటో పజిల్స్ కూడా తారసపడే ఉంటాయ్. ఇవి ఈ మధ్య మస్త్ వైరల్ అవతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ అంటే.. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు ఉండి.. మీ కళ్లను మాయ చేస్తాయి. మంచి ఆట విడుపుగా ఉంటాయ్. మీ బుర్రను ఇవి యాక్టివ్ చేస్తాయ్. వీడని చిక్కుముళ్లుగా ఉండి మీతో రివర్స్ గేమ్ ఆడతాయి. ఎంతసేపు చూసినా అందులో దాగి ఉన్నది కనిపించక కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది. అయితే వాటిని సాల్వ్ చేస్తే మాత్రం.. ఏదో సాధించిన ఫీల్ వస్తుంది. ఈ ఫోటో పజిల్స్ మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో కూడా చెప్పేస్తాయ్. వీటిని సాల్వ్ చేయాలంటే సహనం కూడా అవసరం. ఇచ్చిన టాస్క్ కనీసం ట్రై చేయకుండా.. లేదని వెంటనే సమాధానం చూసేస్తే.. అంత మజా ఉండదు.
తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటో ఓ ఫారెస్ట్ ఏరియాలో తీసిందిగా అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక చిరుత దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం మీకిచ్చే టాస్క్. మీ చూపుల్లో ఎంత పదును ఉందో తెలుసుకోవడానికి కావాలనే ఫోటోను బ్లాక్ అండ్ వైట్ చేసి ఇచ్చాం. ఒకవేళ కొద్ది సమయంలోనే మీరు చిరుతను కనిపెడితే మీ కంటి చూపుల్లో తీక్షణత నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. మా వల్ల కాదు అని చేతులెత్తేస్తే.. ఇక చేసేదేం లేదు. మీరు ఓటమిని అంగీకరించినట్లే. కిందన చిరుత ఉన్న చోట సర్కిల్ చేసి ఉన్న ఫోటోను ఇచ్చాం. అక్కడ చెక్ చేయండి. ప్రజంట్ ఈ క్రేజీ పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. నెక్ట్స్ టైమ్ మరీ ఖతర్నాక్ పజిల్‌తో మీ ముందుకు వస్తాం.. బై.. బై.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..