Optical Illusion: హలో బాస్.. మస్త్ టైంపాస్.. ఈ చిత్రంలో ఓ మనిషితోపాటు 9 జంతువులు దాగున్నాయి.. కనిపెడితే మీరు తోపులే..

|

Aug 09, 2022 | 1:52 PM

ఇవి మెదడు, కళ్లకు సవాల్ విసురుతూ గజిబిజి చేస్తుంటాయి. వీటిని కనుగొనడం వల్ల మన మైండ్, కంటి చూపు షార్ప్ అవుతుంది. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Optical Illusion: హలో బాస్.. మస్త్ టైంపాస్.. ఈ చిత్రంలో ఓ మనిషితోపాటు 9 జంతువులు దాగున్నాయి.. కనిపెడితే మీరు తోపులే..
Optical Illusion
Follow us on

Optical Illusion Test: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల చిత్రాలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. సాధారణంగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలలో అనేక విషయాలు, జంతువులు దాగుంటాయి. కానీ.. వాటిని కనుగొనడం అంత తేలికైన పనికారు. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా.. అనే రీతిలో ఈ ఫొటోలు ఉంటాయి. ఇవి మెదడు, కళ్లకు సవాల్ విసురుతూ గజిబిజి చేస్తుంటాయి. వీటిని కనుగొనడం వల్ల మన మైండ్, కంటి చూపు షార్ప్ అవుతుంది. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో 9 జంతువులు దాగుంటే.. వాటికి ఒక మనిషి కాపలా కాస్తూ సిగార్ తాగుతున్నాడు. మనిషితోపాటు జంతువులను కనిపెట్టడం ఒక ఎత్తయితే.. మరొకటి 15 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. ఇంతవరకు ఈ చిత్రం చూసిన వారు 10శాతం మంది కూడా కరెక్ట్ టైంలో పూర్తిచేయలేకపోయారు. ఇంకెందుకు ఆలస్యం మనిషితోపాటు.. ఆ జంతువులు ఏంటో కనుగొనేందుకు ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Viral Pic

15 సెకన్ల టైం.. మనిషితోపాటు 9 జంతువులను గుర్తించడం..

Optical Illusion

15 సెకన్లలో 10 జంతువులను గుర్తించారా..? లేకపోతే మరో అవకాశం కూడా ఇస్తున్నాం.. ఇంకోసారి ట్రై చేయండి.. దీనిలో జంతువులన్నీ క్లారిటీ కనిపిస్తున్నాయి. చెట్టు చాటున ఓ వ్యక్తి ధూమపానం చేస్తూ కనిపిస్తాడు.

ఇవి కూడా చదవండి

చిత్రాన్ని ఒకసారి కింద నుంచి పై వరకు, అటు, ఇటు చెట్లను పరిశీలించండి.. మరో క్లూ కూడా ఇస్తున్నాం.. దీనిలో చిలుక, బుల్, రూస్టర్, ఫాక్స్, ఏనుగు, గుర్రం, మొసలి, గూస్, జింకను కనిపెట్టాలి.

Viral Pic

ఇంకా గుర్తించకపోతే.. ఈ కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి.. 

Brain Teaser

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మీకూ కూడా నచ్చితే.. మీ మిత్రులకు షేర్ చేసి ఆటపట్టించండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..