AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP MLA Viral Video: టోల్ సిబ్బందిపై ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే గుండాగిరి.. అన్ని వాహనాలను ఫ్రీగా!

పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దాసుహా నియోజకవర్గం ఎమ్మెల్యే కర్మవీర్ సింగ్ టోల్ ప్లాజ్ వద్ద వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ఎమ్మెల్యే కారులో వస్తుండగా..

AAP MLA Viral Video: టోల్ సిబ్బందిపై ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే గుండాగిరి.. అన్ని వాహనాలను ఫ్రీగా!
Aap Mla
Amarnadh Daneti
|

Updated on: Aug 09, 2022 | 12:37 PM

Share

AAP MLA: పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దాసుహా నియోజకవర్గం ఎమ్మెల్యే కరమ్ బీర్ సింగ్ టోల్ ప్లాజ్ వద్ద వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ఎమ్మెల్యే కారులో వస్తుండగా.. హోషియార్ పూర్లోని చౌలాంగ్ టోల్ గేటు వద్ద వీఐపీ లేన్ ను వెంటనే తెరవలేదు. ఒక్క నిమిషం పాటు ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే కరమ్ బీర్ సింగ్ కారు దిగి టోల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంగా టోల్ గేటు సిబ్బంది ఉండే గది అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆతర్వాత తన అనుచరులతో కలిసి అన్ని లేన్లను వదిలి పది నిమిషాల పాటు ఉచితంగా వాహనదారులను పంపించివేశారు. ఇదంతా అక్కడి సీసీ టీవి పుటేజీలో రికార్డు అయింది. దీనిపై టోల్ సిబ్బంది ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే గుండాగిరి చేశారని.. ఆయన గన్ మెన్ తమను బెదిరించాడని టోల్ గేటు వద్ద పనిచేసే కార్మికులు వాపోయారు. ఈవ్యవహారాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కరమ్ బీర్ సింగ్.వీఐపీ లేన్ తెరవడానికి సిబ్బంది ఎవరూ లేరనని.. వాహనదారులు ఇబ్బంది పడకూడదనే తాను ఇలా చేశానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

టోల్ గేట్ మేనేజర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కరమ్ బీర్ సింగ్ తన గన్ మెన్లు, అనుచరులతో కలిసి టోల్ బూత్ ను ఆక్రమించుకుని.. అక్కడి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఈఘటనపై నేషనల్ హైవే అథారిటీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే టోల్ ప్లాజా వద్ద కరమ్ బీర్ సింగ్ దురుసు ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి