Viral Video: లైక్స్ కోసం ట్రై చేసింది.. కానీ గేదె చేసిన పనికి పాపకు దిమ్మ తిరిగింది
ఫన్నీ వీడియోలకు క్రేజ్ మాములుగా ఉండదు. ఈ వీడియోల కోసం నెటిజనులు సోషల్ మీడియాను తెగ గాలిస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబందించినవి చాలా వైరల్ అవుతుంటాయి.

Viral Video: ఫన్నీ వీడియోలకు క్రేజ్ మాములుగా ఉండదు. ఈ వీడియోల కోసం నెటిజనులు సోషల్ మీడియాను తెగ గాలిస్తుంటారు. ముఖ్యంగా జంతువులకు సంబందించినవి చాలా వైరల్ అవుతుంటాయి. జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో మంచిగా ఉంటే మంచి తేడాలొస్తే మాత్రం చుక్కలు చూస్పిస్తాయి. తాజాగా అలంటి వీడియోనే ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక ఆవుతో మహిళ విచిత్రంగా ప్రవర్తించింది. ఆ ఆవును కొడుతూ.. దాని పైకి ఎక్కే ప్రయత్నం చేసింది. దాంతో ఆ ఆవుకు చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ ఆవు పైకి ఎక్కే సమయంలో ఒక్కసారి గా తన కొమ్ములను విదిలించింది దాంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. జంతువులతో పెట్టుకుంటే అంతే అని కొందరు.. తిక్క కుదిరిందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్ వేయండి.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
