Optical Illusion: దట్టమైన అడవిలో చెట్ల పొదల మధ్య దాగున్న పులి.. 10 సెకన్లలో కనుక్కుంటే మీరు తోపు..

|

Oct 10, 2022 | 5:56 PM

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అంత కఠినం కాదు. అయితే కొంచెం పరిశీనల శక్తి అధికంగా కావాల్సి ఉంటుంది. ముందు పులి కనిపించదు.    మనస్సుతో ఆలోచించి కొంచెం దృష్టి పెట్టాలి. మీ కంటి చూపుకు పదును పెట్టాలి

Optical Illusion: దట్టమైన అడవిలో చెట్ల పొదల మధ్య దాగున్న పులి.. 10 సెకన్లలో కనుక్కుంటే మీరు తోపు..
Optical Illusion
Follow us on

సాధారణంగా కనిపించే విషయాలు కూడా కళ్లను మోసగిస్తాయి. ఇలా జరగడం చాలా సార్లు చాలా మంది వ్యక్తుల విషయంలో  జరుగుతుంది. ఒకొక్కసారి ఏదో చూడటం.. దానిని మరొకటిగా అర్థం చేసుకుంటారు. దీనికి సంబంధించిన రకరకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటారు. ఇవి కళ్లను మోసం చేస్తాయి. అంటే  మీ కళ్ళు మొదటి చూపులో ఏదో చూస్తాయి.. మీ మెదడు కళ్ళు చూసినది నిజమని భావిస్తుంది. అయితే ఈ రోజు మేము మీకు అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము. ఇది చూసి మీరు గందరగోళానికి గురవుతారు.

ఈ చిత్రంలో దట్టమైన అడవి దృశ్యం కనిపిస్తుంది. దాని లోపల ఒక పులి దాక్కున్నది. ఆ పులి ఎక్కడ దాక్కుందో కనుక్కోవాలి. ఇది చాలా సవాలుతో కూడుకున్న పని..  ఎందుకంటే మొదటి చూపులో అడవిలో చెట్లు .. మొక్కలు, పొదలు మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది, పులి జాడ కూడా కనిపించదు. అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ చెట్లు, మొక్కలు మాత్రమే కాదు జంతువు కూడా దాగి ఉందని అర్థమవుతుంది.

మీరు పులిని చూశారా?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అంత కఠినం కాదు. అయితే కొంచెం పరిశీనల శక్తి అధికంగా కావాల్సి ఉంటుంది. ముందు పులి కనిపించదు.    మనస్సుతో ఆలోచించి కొంచెం దృష్టి పెట్టాలి. మీ కంటి చూపుకు పదును పెట్టాలి. ఇలాంటి అనేక ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి. వీటిలో దాగిన  వస్తువులను కనుగొనడంలో చెమటలు కక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ వారు దానిని కనుగొనలేకపోయారు. వాటితో పోలిస్తే, ఈ ఆప్టికల్ భ్రమ చాలా సులభం. కాబట్టి మన మనస్సుపై కొంత ఒత్తిడి తెచ్చి, చిత్రంలో దాగి ఉన్న పులిని తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

 

మీరు ఇప్పటికీ పులిని చూడకపోతే, మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాం.. నిజానికి పులి చిత్రం మధ్యలో ఉంది. మీ మెదడు ఇంకా పని చేయకపోతే మీకు సమాధానం మేము చెబుతున్నాం..  పులి చిత్రం మధ్యలో ఉన్న పొదల వెనుక దాక్కుని ఉంది.. తల మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం పరిశీలిస్తే పులిని చూడగలరు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..