ఆప్టికల్ ఇల్యూషన్ అంటే మన కళ్ళు మనల్ని మోసం చేయడమే.. కావాల్సింది.. కనుక్కోవాల్సింది మన ముందే ఉన్న గుర్తించలేము. ఇక సోషల్ మీడియాలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్ష ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తికమక పెడుతుంది. ఈ ఆప్టికల్ భ్రమలో, అన్ని ఒకేలా ఉంటాయి. అయితే వీటిలో ఎక్కడో ఒక పాండా దాగి ఉంది. దాన్ని వెతకడానికి కొంతమంది నానా కష్టాలు పడుతున్నారు. సవాలు ఏమిటంటే, మీరు పాండాను 15 సెకన్లలో కనుగొనగలిగితే, మీరు మేధావి అని నిరూపించుకున్నట్టే. ఆపై ప్రారంభించి ఆ పాండాను కనుగొనండి.
హంగేరియన్ కళాకారుడు గర్జలి దుదాస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అతను ఇలాటి తికమక పెట్టె చిత్రాలను రూపొందించడంలో చాలా ప్రవీణుడని అంటుంటారు. ఆయన గీసిన చిత్రాలను చూసి జనాలు బుర్రకు పదును పెడుతుంటారు. అయితే పైన కనిపిస్తున్న ఫొటోలో పాండా కనిపెట్టడం అంత సులువేమి కాదు. ఎందుకంటే దీన్ని రూపొందించిన కళాకారుడు పాండాను జనం అంత తేలిగ్గా చూడలేని విధంగా దాచిపెట్టాడు.