Optical Illusion Quiz: సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్, పిక్చర్ పజిల్స్ ఆసక్తిని కలిగిస్తుంటాయి. నెటిజన్లు ఈ ఫొటోలను చూడగానే వెంటనే సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలామంది ఇట్టే కనిపెడితే, కొంతమందికి మాత్రం కాస్త సమయం పడుతుంది. మరికొంతమందికి మాత్రం సాధ్యం కాదు. అయితే ఇలాంటి ఫొటోలను చూసిన తర్వాత ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచం ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ టెస్టులతో నిండిపోయింది. కొన్ని మీ కళ్లను ఎంతో పరీక్షిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా అలాంటిదే.
ఇందులో మీరు దాగిన ఓ కుక్కను కనుగొనవలసి ఉంటుంది. ఈ ఫొటోలో కుక్క మీ కళ్ల ముందు దాగి ఉంది. కానీ, ఈ ఫోటోలో మాత్రం దాన్ని చాలా తెలివిగా దాచి ఉంచారు. ఈ ఫొటోలో ఉన్న కుక్కను కనుగొనడంలో చాలామంది వ్యక్తులు విఫలమయ్యారు. మీరు ట్రై చేసి చూడండి మరి.
ఫొటోలో ఏముంది?
ఈ ఫొటోను చూడగానే మీరు చాలా విషయాలు గమనించవచ్చు. ఈ ఫొటోలో మీరు రద్దీగా ఉండే రహదారిని చూస్తారు. భారీ భవనాలు కనిపిస్తాయి. రోడ్డు మీద చాలా వాహనాలు కనిపిస్తాయి. రోడ్డు పక్కన చాలా చెట్లు కనిపిస్తాయి. ఈ ఫొటోలో కుక్క కూడా మీ కళ్ళ ముందు దాగి ఉంది. మరి మీరు ఆ కుక్కను కనుగొనగలిగారా? అయితే, ఓసారి ఆ ఫొటోను తీక్షణంగా పరిశీలించండి మరి.. ఇట్టే దొరికేస్తుంది.
కుక్క ఎక్కడ దాగి ఉందంటే?
ఈ ఫొటోలో మీ కళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎంత వెదికినా.. కుక్కను కనిపెట్టలేకపోయారు. ఈ ఫొటోలో కుక్క లేదని చాలా మంది అంటున్నారు. అందుకే కుక్క ఎక్కడ దాక్కుందో ఇప్పుడ చెప్పబోతున్నాం. ఫొటోను జాగ్రత్తగా చూస్తే.. కుడి వైపున ఉన్న చెట్టు వైపు మీ కళ్ళను ఫోకస్ చేయండి. మీరు చెట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే, చెట్టు పైన ఉన్న కొన్ని కొమ్మల మధ్య ఒక కుక్క బొమ్మ దాగి ఉన్నట్లు గుర్తించవచ్చు.