Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ ‘ మీ మెదడును ఆలోచనలో పడవేయడాన్కి.. మీ పరిశీలన నైపుణ్యాలను పరీక్షించడానికి రూపొందించబడింది. ఇటువంటి చిత్రాలు మీ మెదడుకు వ్యాయామాన్ని ఇస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన ఫోటోలు మీ దృష్టిని మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ రోజు మేము మీ కోసం తీసుకొచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌లో.. నాలుగు పీతలు ఒక పెద్ద గుంపులో దాగి ఉన్నాయి. సవాలు ఏమిటంటే.. మీరు ఈ నాలుగు పీతలను 11 సెకన్లలో కనుగొనాలి. కనుక మీ కంటి పవర్ ఏ రేంజ్ లో ఉందో.. ఈ చిత్రానికి ఇచ్చే సమాధానం చెబుతోంది.
ఈ ఆప్టికల్ భ్రమతో కూడిన ఈ చిత్రం హంగేరియన్ కళాకారుడు, చిత్రకారుడు గెర్గెలీ దుడాస్ ఆలోచన. గెర్గెలీ ఆప్టికల్ భ్రమల చిత్రాలను సృష్టించడంలో నిపుణుడు. అతని చిత్రాలు, స్కెచ్‌లు చూసే వారి మనస్సును కూడా కదిలిస్తాయి. మీరు చిత్రాన్ని గమనిస్తే.. డూడాస్ నాలుగు పీతలను సీఫుడ్ అయిన రెక్కల రొయ్యల మధ్య ఉన్న పెద్ద గుంపులో ఉండేటట్లు చిత్రీకరించాడు. నిజానికి.. ఈ బొమ్మలో రెక్కల రొయ్యలు, పీతల రంగు దాదాపు ఒకేలా ఉండటం వల్ల గుంపులో పీతలు ఎక్కడ ఉన్నాయో కనుగొనడం అంత సులభం కాదు. అయితే మీ కళ్ళ దృష్టిలో ఎంత పవర్ ఉందో .. నిర్ణీత సమయంలో ఆ పీతలను కనుగొనగలరేమో ట్రై చేయండి.. కనుగొంటే ఓకే.. లేదంటే.. ఆ సవాల్ కు సమాధానం కోసం మేము చెప్పే చిట్కాలను పాటించండి.. అప్పుడు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది.
ఎండ్రకాయల మధ్య 4 పీతలు కనిపిస్తున్నాయా?
సముద్రపు తీరంలో అనేక ఎండ్రకాయలు అక్కడక్కడ ఆనందంగా తిరుగుతున్నట్లు చిత్రంలో మీరు చూడవచ్చు. ఎండ్రకాయలే కాకుండా నక్షత్ర చేపలు, నత్తలు కూడా కనిపిస్తున్నాయి ఆ బొమ్మలో. ఈ గుంపులో నాలుగు పీతలు కూడా దాక్కుని ఉన్నాయి. ఆ పీతలను కనుగొనడం ద్వారా మీరు మేధావి అని నిరూపించుకోవాలనుకుంటే.. ఖచ్చితంగా పై నుండి క్రిందికి .. ఎడమ నుండి కుడికి చిత్రాన్ని చూడండి.
మీరు పీతలను చూడలేక, కొన్ని పాయింట్స్ తో మీకు సహాయం చేస్తాం.. మొదటిది సముద్రపు పాచి దగ్గర పీతను చూడవచ్చు. రెండవది కుడి వైపు ఉన్న పీతని చూడవచ్చు.. అనంతరం మూడు నాలుగు పీతలు కింద ఉన్నాయి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..