ఆప్టికల్ ఇల్యూజన్ కేవలం కంటి పరీక్ష టెస్ట్‌కు మాత్రమే పరిమితం కాకుండా మన ఆలోచనలకు కూడా పదును పెడుతుంది. మెంటల్ ఎలిబిటీకి సంబంధించిన ఇలాంటివి మన ఆలోచన పరిధిని పెంచుతాయి. ఒకప్పుడు ఇలాంటివి కేవలం మ్యాగజైన్‌లకు మాత్రమే పరిమితమయ్యేవి కానీ.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట ఇలాంటి ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆలోచన శక్తికి పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌ను సాల్వ్ చేయడానికి నెటిజన్లు సైతం ఆసక్తిచూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘Whats Wrong’ అనే టైటిల్‌తో ఉన్న పజిల్‌ను సాల్వ్ చేయమని పోస్ట్‌లు చేస్తున్నారు. పైన ఫొటో చూడగానే హ్యాండ్ ర్యాటింగ్‌తో ఇంగ్లిష్ ఆల్ఫబెట్స్ రాసున్నాయి కదూ! అయితే ఇందులో ఓ తప్పు ఉంది కనిపెట్టగలరా.? మీరు ఎంత ఏకాగ్రతతో గమనిస్తే తప్పును అంత సులభంగా గుర్తించగలరని ఇందులో రాసుకొచ్చారు.
Can you find ? ? pic.twitter.com/I4jBwodbV2
— Anu Sehgal ?? (@anusehgal) February 20, 2023
ఏంటి ఆల్ఫబెట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. పెద్దగా ఏ మిస్టేక్ కనిపించడం లేదనంటారా.? అయితే ఓసారి తీక్షణంగా గమనించండి ఇందులో ఉన్న తప్పు కనిపిస్తుంది. అన్ని స్పెల్లింగ్స్ సరిగ్గానే ఉన్నాయి అనుకుంటున్నారు కదూ అయితే కింద రాసున్న టెక్ట్స్‌ను ఓసారి గమనించండి. చివరల్లో రాసి ఉన్న ‘ఫైండ్ ది మిస్టేక్’లోనే అసలు మిస్టేక్ ఉంది. అదేనండి Find స్పెల్లింగ్‌లో ఉన్న తప్పే ఇందులో ఉన్న అసలు మిస్టేక్.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..