Viral Video: చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. కారణం కల్లాకపటం లేని వారి పసి మనసులే. వారిలో స్వార్థం, ద్రోహం, మోసం, పేద, ధనిక తేడాలు వంటి దుర్మార్గపు ఆలోచనలు అస్సలు ఉండవు. మనసు నిర్మలంగా ఉంటుంది. అందరితోనూ కలిసి పోతారు. త్వరగా స్నేహం చేస్తారు. ఆ వయసులో జాలి, దయ, కరుణ మాత్రమే ఉంటాయి. వారి స్నేహం కూడా అంతే నిష్కల్మషంగా ఉంటుంది. ఇక చిన్నారుల్లో స్నేహం ఎంత నిజాయతీగా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అది చూసి నెటిజన్లు అయ్యో అంటూ జాలిపడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. హాస్టల్‌కి వెళ్లిన ఓ చిన్నారికి వాళ్ల అమ్మ గుర్తుకువచ్చి ఏడుస్తాడు. అది చూసి వాడి స్నేహితురాలు ఏడవొద్దంటూ అతన్ని ఓదారుస్తుంది. ఈ చిన్నారుల క్యూట్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఈ సంఘటన జరిగింది. అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తున్న ఓ చిన్న పిల్లాడిని స్నేహితురాలు దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది.
‘‘అరే ఏడవకురా.. ఊర్కో. అమ్మ గుర్తుకు వస్తుందా.. ఏడవకు.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’ అంటూ తనకు తోచిన రీతిలో తన స్నేహితుడిని ఓదారుస్తుంది. ‘‘ప్రేమ అనేది మానవుల సహజ లక్షణం.. అలవాటు చేసుకుంటే అయ్యేది కాదు. ప్రేమ విశ్వవ్యాప్తం.. దానికి ఎంతో శక్తి ఉంది. ప్రేమిస్తూ ఉండండి.. హాస్టల్‌లో ఉన్న ఈ ఇద్దరు చిన్నారులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకుంటున్నారో చూడండి’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. నాకు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ఎంత అందమైన బంధమో కదా అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను రట్వీట్లు, లైక్స్ చేస్తున్నారు.
Also read:
Farmers: పాపం రైతన్న.. జింక పేరు వింటే చాలు హడలిపోతున్నారు.. అంతలా భయపడటానికి కారణమేంటంటే..
IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మరో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాలకు గట్టి పోటీ..