జాలర్ల వలలో అత్యంత అరుదైన భారీ చేప.. మత్స్యకారుల అదృష్టం మారింది.. బరువు, ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
మత్స్యకారుల వలలో అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. కొన్ని మాంసాహార చేపలు కాగా, మరికొన్ని వైద్యపరంగా ఉపయోగపడే చేపలు జాలర్ల అదృష్టాన్ని మార్చేస్తుంటాయి. అరుదైన చేపల ధర వేలు, లక్షల్లో ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలోని బాలాసోర్ తీరంలో చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన అక్కడి జాలర్లకు అత్యంత అరుదైన ఓ భారీ చేప చిక్కింది. ఒడిశాలోని బాలాసోర్‌లో అరుదైన చేపలు దొరికాయి . ఇది మత్స్యకారుల భవితవ్యాన్ని మార్చేసింది. ఈ చేప 550 కిలోల బరువు ఉంటుందని తెలిపారు. దాని బరువు, తెలిసిన స్థానికులు అవాక్కయ్యారు.
మార్లిన్ అనే అరుదైన ఈ మాంసాహార జాతి చేప ఒడిశాలోని బాలాసోర్‌లో మత్స్యకారుల వలలో చిక్కుకుంది. దీన్ని మార్లిన్ ఫిష్ అని, మార్లిన్ AKA అని, సెయిల్ మార్లిన్ అని పిలుస్తారు. ఈ చేప బరువు 550 కిలోలు. ఈ చేప లక్ష రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ చేపల అవశేషాలను యాంటి డిప్రెసెంట్ డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు మత్స్యశాఖ సహాయ అధికారి పార్థసారథి స్వైన్ తెలిపారు. ఇది అత్యంత అరుదైన చేపగా చెప్పారు. మాంసాహార జీవ జాతికి చెందిన ఈ భారీ చేపలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి.
Odisha| A rare carnivorous species fish called Marlin AKA Sailor Marlin weighing 550kg was netted in Balasore. The fish was sold for Rs 1 Lakh.
It is said that remains of this fish are used to make anti-depressant medicines: Parthasarathi Swain, Assistant Fisheries Officer pic.twitter.com/QUFFWk426s— ANI (@ANI) November 15, 2022
ఒడిశా తీరంలో ఇలాంటి అరుదైన భారీ చేప చిక్కడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా మత్స్యకారులు భారీగా చేపలను పట్టుకుని వాటిని విక్రయించి లక్షాధికారులుగా మారారు. అంతకుముందు భద్రక్ జిల్లాలోని చాంద్‌బాలీ నుంచి 32 కిలోల బరువున్న చేపను మత్స్యకారుడు పట్టుకున్నాడు. 3 లక్షలకు పైగా ఆ చేపలను విక్రయించినట్లు మత్స్యకారుడు పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి