ఆ 5రోజులు ఈ గ్రామంలోని మహిళలు దుస్తులు ధరించరు..! అనాదిగా వస్తున్న ఓ వింత ఆచారం.. ఎక్కడంటే..

|

Aug 27, 2023 | 5:30 PM

ఈ ఐదు రోజులలో పురుషులు కూడా ప్రత్యేక నియమాలను నిర్దేశిస్తారు. ఈ సమయంలో పురుషులు మద్యం, మాంసం తినకూడదు. ఈ సంప్రదాయాన్ని సరిగ్గా పాటించడంలో వైఫల్యం చెందితే.. దేవతలకు కోపం తెప్పించి హాని కలుగుతుందని నమ్ముతారు. ఈ పురాతన ఆచారం అనాదిగా కొనసాగుతూ ఇప్పటికీ ఆచారంలో ఉంది. అలాగే ఈ కాలంలో ఈ ఆచారాలు పాటించని భార్యాభర్తల వల్ల ఆ ఊరిలో వారికి కూడా ఇబ్బంది కలుగుతుందని, అంతేకాదు.. ఆ ఇద్దరూ విడిపోతారని కూడా ఒక నమ్మకం.

ఆ 5రోజులు ఈ గ్రామంలోని మహిళలు దుస్తులు ధరించరు..! అనాదిగా వస్తున్న ఓ వింత ఆచారం.. ఎక్కడంటే..
No Dress For Women
Follow us on

మన దేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. వివిధ కులాలు, మతాల ప్రజలు వారి వారి విశ్వాసాలు, ఆచారాలను అనుసరించి ఇక్కడ నివసిస్తున్నారు. ఆ విధంగా భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మన కళ్లకు చాలా వింతగా, నమ్మశక్యం కాని పురాతన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం లింగ సమానత్వ ఆలోచనతో ఆధునిక యుగంలోకి కొనసాగుతోంది. కానీ, మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని అసాధారణ సంప్రదాయాలు మహిళలను ప్రత్యేకమైన పరిస్థితులలోకి నెట్టేలా చేస్తున్నాయి.. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని పిని గ్రామం అలాంటి వాటిలో ఒకటి.

ఈ గ్రామంలో వర్షాకాలంలో జరిగే పండుగ మరింత ప్రత్యేకం. ఈ పండుగలో భాగంగా ప్రజలు కొన్ని ఆచారాలు, నియమాలను పాటిస్తారు. అందులో అతి ముఖ్యమైన, విచిత్రమైన నియమం ఏమిటంటే, పండుగ జరిగే ఐదు రోజులలో స్త్రీలు బట్టలు ధరించకూడదు. మరో విచిత్రమైన ఆచారం ఏమిటంటే, వేడుకల సమయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్వకూడదు. అవును, వర్షాకాలంలో జరిగే ఈ 5 రోజుల పండుగలో మహిళలు పూర్తిగా నగ్నంగా ఉంటారు. ఆ రోజుల్లో వారు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. గ్రామంలోని ఇతర పురుషుల ముందు బయటకు రాలేరు. ఇంట్లోనే ఉంటారు. ఇది అక్కడి ఆచారం.

మహిళల కోసం చట్టాలు..

ఇవి కూడా చదవండి

గ్రామస్తులు పూజించే దేవత ఒక రాక్షసుడిని ఓడించిన క్షణానికి గుర్తుగా భద్రబ్ మాసం మొదటి రోజున గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దుష్టశక్తులు మహిళల గౌరవంపై దాడి చేసి వారి దుస్తులను చింపివేస్తాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. మరి కొన్ని ఇతర కారణాల వల్ల ఈ గ్రామాల్లో మహిళలు పండుగ సమయంలో దుస్తులు ధరించరు.

మహిళలు, బట్టలు విప్పిన తర్వాత, వారి శరీరాన్ని కప్పి ఉంచుకోవడానికి ఉన్ని దుప్పట్లను ఉపయోగిస్తారు. ఈ సమయాల్లో బిని విలేజ్ నివాసితులు పూర్తి నిర్బంధ జీవితాన్ని గడుపుతారు. అయితే కాలక్రమేణా గ్రామంలోని యువ తరం మహిళలు కొందరు ఈ ఆచారాన్ని మార్చారు. పండగ సందర్భంగా ప్రత్యేకించి చాలా సన్నని దుస్తులు ధరించడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా పండగ సమయంలో వృద్ధ మహిళలు నగ్నంగా వెళ్లే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

ఏ స్త్రీ అయినా ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే కొద్దిరోజుల్లో ఆమె కొన్ని చెడు వార్తలను వినాల్సి వస్తుందని నమ్ముతారు. అలాగే ఈ కాలంలో ఈ ఆచారాలు పాటించని భార్యాభర్తల వల్ల ఆ ఊరిలో వారికి కూడా ఇబ్బంది కలుగుతుందని, అంతేకాదు.. ఆ ఇద్దరూ విడిపోతారని కూడా ఒక నమ్మకం.

పురుషుల కోసం నియమాలు..

ఈ ఐదు రోజులలో పురుషులు కూడా ప్రత్యేక నియమాలను నిర్దేశిస్తారు. ఈ సమయంలో పురుషులు మద్యం, మాంసం తినకూడదు. ఈ సంప్రదాయాన్ని సరిగ్గా పాటించడంలో వైఫల్యం చెందితే.. దేవతలకు కోపం తెప్పించి హాని కలుగుతుందని నమ్ముతారు. ఈ పురాతన ఆచారం అనాది కొనసాగుతూ ఇప్పటికీ ఆచారంలో ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..