వామ్మో.. ఇదేక్కడి విచిత్రం రా సామీ.. పుట్టిన మూడు రోజులకే ఈ శిశువు ప్రయత్నం చూస్తే అవాక్కే..!

|

Jun 05, 2023 | 1:48 PM

వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు వీడియోని చూశారు. లైక్ చేసారు. అదే సమయంలో, వినియోగదారులు కూడా దీనిపై భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. ఇందులో షాక్‌ అవ్వాల్సింది ఏమీ లేదని ఓ వైపు కొందరు చెబుతుండగా, ఈ ఆడపిల్ల చేస్తున్న చర్యలు షాకింగ్ గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వామ్మో.. ఇదేక్కడి విచిత్రం రా సామీ.. పుట్టిన మూడు రోజులకే ఈ శిశువు ప్రయత్నం చూస్తే అవాక్కే..!
Baby Crawling
Follow us on

పుట్టిన శిశువు వెంటనే కళ్లు తెరలేడు. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే శిశువు దాదాపు మూడు నెలలకు గానూ పక్కకు జరగటం, బోర్లా పడటం చేస్తుంటారు. 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు నడవడం నేర్చుకుంటుంది. ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లల తొలి అడుగు చాలా ప్రత్యేకమైనది. ఈ క్షణాన్ని మాటల్లో వర్ణించలేం. అయితే, ఇక్కడ ఓ చిన్నారి చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పసికందు కొన్ని నెలల్లో కాదు మూడు రోజుల్లోనే నడక ప్రారంభించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మే 25న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఇది పిల్లల తల్లి అయిన (@సమంత ఎలిజబెత్) అనే వినియోగదారు షేర్‌ చేశారు. ఆమె వీడియోకి క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు – ఇది జరిగిందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక వైరల్‌ అవుతున్న వీడియోలో మూడు రోజుల పసికందు ఆసుపత్రి బెడ్‌పై బోల్తా పడటానికి, మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు మనం చూడొచ్చు.. అతని తల్లి ఈ ప్రత్యేక క్షణాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇదేలా సాధ్యం అనుకుని వెంటనే వీడియో రికార్డ్‌ చేశారు. మూడు రోజుల పసికందు ఇలా నడవడం మునుపెన్నడూ చూడలేదు. ఇది జరిగినప్పుడు ఆసుపత్రి గదిలో ఆ తల్లి, తన అమ్మ మాత్రమే ఉన్నారని చెప్పింది. వీడియో రికార్డ్ చేయటం ద్వారా విషయం తెలిసింది. లేదంటే ఎవరూ నమ్మేవారు కాదని చెప్పింది. తన భర్త కూడా అక్కడ లేరని చెప్పింది. తాను తన భర్తకి వీడియో చూపించటం ద్వారానే అతగు తన మాట విన్నాడు అని చెప్పింది.

ఇవి కూడా చదవండి

వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు వీడియోని చూశారు. లైక్ చేసారు. అదే సమయంలో, వినియోగదారులు కూడా దీనిపై భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. ఇందులో షాక్‌ అవ్వాల్సింది ఏమీ లేదని ఓ వైపు కొందరు చెబుతుండగా, తల్లి పాలు తాగేందుకు వెతుకుతూ పిల్లలు ఇలా చేస్తారంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.. మరోవైపు ఈ ఆడపిల్ల చేస్తున్న చర్యలు షాకింగ్ గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..