Viral Video: వైరల్ అవుతున్న వీడియోలో మీరు ఒక డ్యామ్‌ను చూడవచ్చు. డ్యామ్ నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ దిగువను వెళ్తున్నాయి. అదే సమయంలో ఒక వ్యక్తి ఆనకట్ట దిగువన చేపలు పడుతున్నాడు. డ్యామ్ కింది భాగంలో చేపలు వేసే బుట్టలను ఉంచాడు. నీటి ప్రవాహానికి చేపలు ఆ బుట్టల్లో పడుతున్నాయి. ఎలాంటి కష్టం లేకుండా నీటి ప్రవాహానికి వచ్చిన చేపలు కింద ఉన్న బుట్టలో పడిపోతున్నాయి.
ప్రశంసలు
ఈ వ్యక్తి ఫిషింగ్ కోసం చేసే పద్ధతి నిజంగా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఇతను చేపలు పట్టే విధానాన్ని చూసి నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియో జాక్‌ఫ్రూట్ అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోకు లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. వేలాది మంది వీక్షించారు. నెటిజన్లు ఎవరికి వచ్చినట్లు వారు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి