Viral: దేశంలో సంచలనం సృష్టిస్తున్న అనేక సంఘటనలను ముందే ఊహించి చెబుతున్న ఓ ట్విట్టర్ యూజర్ ఇప్పుడు సంచలనంగా మారాడు. ఏకంగా ఆధునిక నోస్ట్రాడమస్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. నాడు నీరజ్ చోప్రా ఒలింపిక్ విజయం, నేడు రాష్ట్రపతి రేసు ద్రౌపది ముర్ము నిలవడం సహా పలు అంశాలపై నితీక్ష్ శ్రీవాస్తవ అనే ట్విట్టర్ యూజర్ ముందే చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. దేశంలోనే అత్యంత కీలక సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
2018 ఆగస్టులో నీరజ్ చోప్రా భారత్‌కు ఒలింపిక్ పతకాన్ని తీసుకువస్తాడని శ్రీవాస్తవ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అతను అన్నట్లుగానే.. 2021లో, టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో భారతదేశం నుంచి మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.
ఇక 2016లో, రామ్ నాథ్ కోవింద్ భారతదేశ తదుపరి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని శ్రీవాస్తవ ట్వీట్ చేశారు. అతను ఊహించినట్లుగానే రామ్ నాథ్ కోవింద్ 2017లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇటీవల, నితీక్ష్ శ్రీవాస్తవ.. ద్రౌపది ముర్ము ‘‘భారతదేశ తదుపరి రాష్ట్రపతి’’ అని ట్వీట్ చేశారు. ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా ముర్ము పేరు పెట్టడంతో అతని అంచనా నిజమైంది.
I am potentially on the verge of internet immortality. Come on Modi ji. Just do it! pic.twitter.com/b2KMdoFyEv
— Niks (@niks_1985) June 13, 2022
ఈ అసాధారణమైన, ఖచ్చితమైన అంచనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీవాస్తవ చేసిన ట్వీట్లు, ఇతర పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అతని ప్రిడిక్షన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారతదేశపు నోస్ట్రాడమస్‌గా పిలుస్తున్నారు సోషల్ మీడియా యూజర్స్.