AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై దాడి .. బైక్‌లపై 20KM కార్‌ను చేజ్ చేసిన పోకిరీలు

మహారాష్ట్రలో ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నాసిక్‌లోని ఓ ప్రసిద్ధ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఒక కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆ కుటుంబాన్ని సుమారు 20 కిలోమీటర్ల మేర బైక్‌లపై వెంబడించి భయభ్రాంతులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Viral Video: విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై దాడి .. బైక్‌లపై 20KM కార్‌ను చేజ్ చేసిన పోకిరీలు
Nashik Waterfall Family Attack
Anand T
|

Updated on: Jul 15, 2026 | 1:36 PM

Share

నాసిక్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కొందరు వ్యక్తులు ఆ కుటుంబాన్ని 20 కిలోమీటర్ల దూరం వెంబడించి, రాడ్లు, కర్రలతో వారి కారుపై దాడి చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యుల కుటుంబం.. ఇగత్‌పురి పట్టణంలోని భావ్లీ డ్యామ్ వద్ద ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చింది. అయితే అక్కడున్న కొందరు పోకిరీలు ఆ కుటుంబంలోని ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, పక్కనే ఉన్న షాప్ వారు కూడా నిందితులతో కలిసి తమపైకి వచ్చారని వారు తెలిపారు. ఎలాగోలా పరిస్థితిని సద్దుమణిగించి అక్కడి నుంచి బయటపడ్డామని చెప్పారు.

అయితే వారు కారులో అక్కడి నుంచి బయల్దేరి వచ్చినా దుండగులు వదల్లేదు. సుమారు 8 నుంచి 10 మంది బైక్‌లపై కారును చేజ్ చేస్తూ, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వెంబడించి, కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో నలుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారని, తాము ఎంతో భయపడిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కారులో ఉన్న కొందరు ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దాడికి పాల్పడిన మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై పోకిరీల దాడి.. వీడియో వైరల్
విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై పోకిరీల దాడి.. వీడియో వైరల్
ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..
ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు